లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రెండు ప్రధాన కూటములు రాజకీయాలను వేగవంతం చేయడంతో... ఇప్పుడే ఎన్నికలు జరుగుతున్నాయా అనే వాతావరణం నెలకొంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఢిల్లీలో సమావేశం జరిగిన రోజే ... ఈ నెల 18న మంగళవారం... 26 విపక్షాల కొత్త కూటమి బెంగళూరులో సమావేశం నిర్వహించింది. ఈ కూటమికి విపక్ష నేతలు ‘ఇండియా’ గా నామకరణం చేశారు. తద్వారా దేశ రాజకీయాల్లో సుదీర్ఘ కాలంగా వినిపించిన యూపీఏ అంటే... ఐక్యప్రగతిశీల కూటమి పేరు అంతర్థానమైంది. దీని స్థానంలో సరికొత్త ‘ఇండియా’ ఆవిర్భవించింది.

ఇండియా పేరును టీఎంసీ  నాయకురాలు, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సూచించారు. ఐ.ఎన్.డి.ఐ.ఏ.  అంటే.... ఇండియన్‌ నేషనల్‌ డెవలప్ మెంటల్‌ ఇంక్లూజివ్‌ అలయెన్స్‌... అని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ పూర్తి రూపం ఇచ్చారు. దీన్నే తెలుగులో ‘భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి గా కాంగ్రెస్ నేతలు వివరించారు. దీన్ని మిత్రపక్షంలోని అని పార్టీల నేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు. 11 మందితో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. విపక్షాల తదుపరి భేటీ ముంబైలో జరుగుతుంది. అలాగే కూటమి ప్రచార కార్యక్రమాల నిర్వహణకు ఢిల్లీలో ఉమ్మడి సెక్రటేరియట్‌ ఏర్పాటు చేస్తారు. వివిధ అంశాలపై వేర్వేరు సబ్‌ కమిటీలను నియమిస్తారు. ఈ మేరకు 26 రాజకీయ పార్టీల తరఫున 40 మంది నేతలు సమావేశంలో పాల్గొని వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

కాగా... విపక్షాల భేటీ గ్రాండ్‌ సక్సెస్‌ అయిందని... ఈ భేటీ సక్సెస్ అవుతుందని ముందుగానే గ్రహించిన ప్రధాని మోదీ... విపక్షాల మీటింగ్ జరిగిన రోజే... హడావుడిగా ఎన్‌డీఏ భేటీ ఏర్పాటు చేశారని ఆ పార్టీల నేతలు అన్నారు.  కాగా... పట్నాలో జరిగిన విపక్షాల తొలి సమావేశానికి 15 పార్టీల నేతలు హాజరుకాగా... బెంగళూరు సమావేశంలో వారి సంఖ్య 26కు పెరిగింది. ముంబైలో జరిగే మూడో సమావేశం నాటికి 30 దాటవచ్చని కాంగ్రెస్ అగ్రనేతలు అంటున్నారు.

కాగా... ప్రస్తుతం జట్టుకట్టిన విపక్షాల మధ్య ... కొన్ని రాష్ట్రాల్లో విభేదాలున్న మాట వాస్తవమేనని... అయితే సైద్ధాంతిక పరమైనవి కావని.. దేశ ప్రయోజనాల కోసం.. రాజ్యాంగం, ప్రజాస్వామ్య రక్షణకు వాటిని పక్కనపెట్టి... సమష్టిగా పనిచేస్తామని ఆయా పార్టీల నేతలు ముక్తకంఠంతో అంటున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేస్తామని... బీజేపీపై విజయం సాధిస్తామని స్పష్టం చేస్తున్నారు. నిజంగా... ఇది ప్రజాస్వామ్య పరిరక్షణకు మంచి పరిణామమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బెంగళూరులో జరిగిన విపక్షాల సమావేశంలో ఖర్గేతో పాటు కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియా, రాహుల్‌, బెంగాల్‌, బిహార్‌, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్‌, జార్ఖండ్‌, కర్ణాటక సీఎంలు మమత, నితీశ్‌, స్టాలిన్‌, కేజ్రీవాల్‌, భగవంత్‌, సోరెన్‌, సిద్దరామయ్య, ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌, ఆర్‌జేడీ అధ్యక్షుడు లాలూ, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌, లెఫ్ట్‌ నేతలు ఏచూరి, రాజా, దీపాంకర్‌ భట్టాచార్య తదితర నేతలు పాల్గొన్నారు. కాగా... సమావేశంలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ... ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముక్కలుముక్కలైన పార్టీలను ఒక చోటకు తీసుకురావడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని.. విపక్షాలకు ఆయన భయపడుతున్నారనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. బీజేపీ గత ఎన్నికల్లో సొంత బలంతో 303 స్థానాలు తెచ్చుకోలేదని.. మిత్రుల ఓట్లతో అధికారంలోకి వచ్చి వారిని పక్కనపెట్టిందని విమర్శించారు. ఇప్పుడు మోదీ... బీజేపీ అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలు పాత మిత్రులతో పొత్తులకు రాష్ట్రాలకు పరుగులు పెడుతున్నారని అన్నారు.

కాగా... ఖర్గే ఒక ప్రశ్నకు సమాధానంగా చెబుతూ లోక్‌సభ ఎన్నికల్లో మిత్రపక్షాల మధ్య సీట్ల పంపిణీ సమస్య కాబోదని... మేమందరం ఐకమత్యంతో కలిసే పోరాడతామని... 2024 ఎన్నికల్లో బీజేపీని గద్దె దించి కేంద్రంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాగా కొత్త కూటమికి ఏం పేరు పెడదామన్న చర్చ సోమవారమే జరిగింది. ‘ఇండియా ఫ్రంట్‌’ సహా నాలుగైదు పేర్లు ప్రతిపాదనకు వచ్చాయి. మమతా బెనర్జీ ‘ఇండియా’ పేరును ప్రతిపాదించగా.. రాహుల్‌గాంధీ దానికి పూర్తి రూపం ఇచ్చారు. మొత్తమ్మీద... ఎంతోకాలంగా ఉన్న యూపీఏ పేరును మార్చి ... విపక్ష కూటమికి ‘ఇండియా’గా కొత్త నామకరణం చేశారు. కొత్తపేరు కలిసి వస్తుందా... 2024 ఎన్నికల్లో కొత్త విపక్ష కూటమి కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకుంటుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఏంజరుగుతుందో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos