తెలంగాణ రాష్ట్రంలోకి ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించాయి. మే నెల చివరలోనే జోరు వానలు కురిశాయి. దీంతో అన్నదాతలు వ్యవసాయ పనులు ప్రారంభించారు. అయితే ఆ తర్వాత నాలుగైదు రోజులు అంటే జూన్ నెల ప్రారంభంలో వానలు పత్తా లేకుండా పోయాయి. మాడు పగిలే ఎండలు జనాలను భయపెట్టాయి. ముందుగా విత్తనాలు వేసుకున్న రైతులు వరుణుడి రాక కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వారి ఆశలు నెరవేరేలా.. గత రెండు మూడు రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక హైదరాబాద్ పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈక్రమంలో వాతావరణ శాఖ అధికారులు తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. మరో ఆరు రోజులు తెలంగాణలో జోరు వానలు కురుస్తాయని తెలిపారు. అలానే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో రానున్న ఆరు రోజులు జోరు వానలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అంతేకాక గంటకు 40-50 కిలోమీటర్ల బలమైన గాలులు వీస్తాయని.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అలానే నేడు శుక్రవారం కూడా భాగ్యనగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేకాక శుక్రవారం నాడు నిర్మల్, ఉమ్మడి మహబూబ్‌నగర్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలానే శనివారం నాడు మెదక్, వరంగల్, ఆదిలాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లా, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అంతేకాక ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఇదిలా ఉంటే గురువారం తెల్లవారుజామున, అలానే రాత్రి సమయంలో కూడా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. సెల్లార్లలోకి భారీ ఎత్తున వాన నీరు చేరడంతో ట్రాక్టర్ల ద్వారా నీటిని బయటకు పంపిస్తున్నారు. ఇక ఆదిలాబాద్‌లో గురువారం పిడుగుపడి ఆరుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. మరి కొన్ని రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

మరోవైపు... మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరిస్తుందని, దాని ప్రభావంతో రానున్న నాలుగు రోజుల్లో ఏపీలో ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో వానలు దంచి కొట్టే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. ఈ నెల 18, 19 తేదీల్లో వాయవ్య, దానికి ఆనుకుని మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావంతో  అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇవాళ శుక్రవారం మన్యం, అల్లూరి, కాకినాడ, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం రాత్రి 7 గంటల వరకు తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో 64 మిల్లీమీటర్లు, పల్నాడు జిల్లా మాచర్లలో 61.7, కాకాణిలో 55, చిత్తూరు జిల్లా రెడ్డిగుంటలో 54 మిల్లీమీటర్ల వాన పడింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Take Oath As A TDP National Working President | CM Chandrababu | AG

తాజా వార్తలు

15-49-17-0617.jpg

మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం.. ఆర్టీజీఎస్ పై సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
2026-06-22 Time: 03:49:17

15-31-26-0626.jpg

ప్రజా ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టులు.. 4 అంశాలపై ప్రోగ్రెస్ రిపోర్టులను విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు
2026-06-22 Time: 03:31:26

17-02-16-0616.jpg

అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు.. చిన్నారులతో కలిసి రాగి జావ తీసుకున్న చంద్రబాబు
2026-06-20 Time: 05:02:16

14-06-28-0628.jpg

90వ రోజు ప్రజాదర్బార్.. వివిధ సమస్యలపై ప్రజల  వినతుల స్వీకరణ.. అన్నివిధాల అండగా ఉంటానట్టు  మంత్రి లోకేష్ హామీ
2026-06-16 Time: 02:06:28

14-04-35-0635.jpg

సెమీకండక్టర్ల తయారీకి ఏపీ బెస్ట్ డెస్టినేషన్.. సింగపూర్‌లో సెమీకండక్టర్లపై సెమీకాన్ ఎకోసిస్టమ్ సదస్సులో సీఎం చంద్రబాబు
2026-06-16 Time: 02:04:35

Related Videos