మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్ మృతి పై తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దివంగత నేత మన్మోహన్ సింగ్ కు... మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తో విపరీతమైన సాన్నిహిత్యం ఉండేది.  పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా పనిచేసినప్పుడు.. మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. వీరిద్దరి ఆలోచనలు ఒకే విధంగా ఉండడంతో.. నాడు పీవీ నరసింహారావు చేపట్టిన ఆర్థిక సంస్కరణలకు మన్మోహన్ సింగ్ తన వంతు మద్దతు అందించారు. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ దేశంలో ఆర్థిక సంస్కరణలను అమలు చేశారు.

మనదేశంలో జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, నరేంద్ర మోడీ తర్వాత అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన రికార్డును మన్మోహన్ సింగ్ సొంతం చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న ప్రస్తుత పాకిస్తాన్ లోని చెక్వాల్ ప్రాంతంలో జన్మించారు.. ఉన్నత విద్యను అభ్యసించిన మన్మోహన్ సింగ్.. ఆర్థికపరమైన అంశాలపై విపరీతమైన పట్టును కలిగి ఉండేవారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో డాక్టరేట్ పొందారు. కేంబ్రిడ్జ్ నుంచి పీజీ పట్టా పొందారు. ప్లానింగ్ కమిషన్ చీఫ్‌గా, ఎకనామిక్ అడ్వైజర్‌గా భారత ప్రభుత్వంలో కీలక పదవుల్లో పనిచేశారు. 1991లో తొలిసారి మన్మోహన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఐదుసార్లు అసోం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

1991 నుంచి 96 వరకు అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు మన్మోహన్ సింగ్. తొలి సిక్కు ఆర్థికమంత్రిగా ఆయన రికార్డుల్లోకెక్కారు. భారత ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ ఘనత వహించారు.ఇక, 2004 నుంచి 2014 వరకు యూపీఏ హయాంలో భారత ప్రధానమంత్రిగా   సేవలందించారు. మన్మోహన్ సింగ్ హయాంలోనే ఉపాధి హామీ, ఆర్టీఐ చట్టం అమల్లోకి వచ్చాయి. 2024లో ఆయన రాజ్యసభ సభ్యుడిగా పదవీ విరమణ చేశారు. పద్మవిభూషణ్ సహా అనేక అవార్డులు, పురస్కారాలను మన్మోహన్ అందుకున్నారు. 33 సంవత్సరాల పాటు మన్మోహన్ సింగ్ పార్లమెంటు సభ్యుడిగా పని చేశారు. 1991లో పెద్దల సభకు ఎంపికయ్యారు. ఆర్థిక శాఖ మంత్రి కాకముందుకు.. ఆర్థిక శాఖ సలహాదారుగా, కార్యదర్శిగా మన్మోహన్ సింగ్ పనిచేశారు.

మన్మోహన్ సింగ్ ప్రజా సేవా జీవితంలో అనేక పురస్కారాలు, గౌరవాలు పొందారు. అందులో ప్రముఖమైనవి భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మ విభూషణ్ (1987), జవహర్ లాల్ నెహ్రూ జయంతి శతాబ్ది పురస్కారం (1995), ఆసియా మనీ అవార్డు ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ (1993-1994), యూరో మనీ అవార్డు ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ (1993), యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ ఆడమ్ స్మిత్ ప్రైజ్ (1956), సెంట్రల్ లండన్ లోని సెంట్ జాన్ కాలేజ్ ద్వారా ప్రదర్శనలో ప్రఖ్యాతి చెందిన రైట్ ప్రైజ్ (1955) ఉన్నాయి. అలాగే, పలు దేశాల అత్యున్నత పురస్కారాలు కూడా అందుకున్నారు మన్మోహన్ సింగ్.

మన్మోహన్ సింగ్ కన్నుమూసిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఎయిమ్స్ నుంచి మన్మోహన్ సింగ్ మృతదేహాన్ని ఆయన స్వగృహానికి.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయానికి తరలిస్తారు. ప్రముఖుల సందర్శనార్థం మన్మోహన్ సింగ్ భౌతికకాయాన్ని శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఉంచుతారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos