దేశంలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. భద్రతా బలగాల వాహన్నాన్ని పేల్చేశారు. మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందుపాతర పేలి పదిమంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. బీజాపూర్‌ జిల్లా అటవీ ప్రాంతంలో ఈ మందుపాతర పేలినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో వ్యాన్‌లో 15 మంది జవాన్లు ఉన్నట్లు సమాచారం. ఈ విషయం తెలియడంతో భద్రతా బలగాలు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. జవాన్లు ఇవాళ ఉదయం కుత్రు అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తుండగా.. వారిని లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు మందు పాతర పేల్చేయడంతో భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న వ్యాన్ పేలిపోయింది. ఈ పేలుడు కారణంగా 10 మంది జవాన్లు మృతి చెందగా.. ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. కాగా గత కొన్నాళ్లుగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌, సుకుమా జిల్లాల్లో మావోయిస్టుల కదలికలు పెరుగుతున్నాయి. దీంతో పోలీసులు కూడా తనిఖీలు పెంచారు.

కాగా ఈ ఘటనకు ముందు రోజు ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపుర్‌-దంతెవాడ జిల్లాల సరిహద్దు్ల్లోని దక్షిణ అబూజ్‌మడ్‌ అటవీ ప్రాంతం తుపాకుల కాల్పుల మోతతో దద్దరిల్లింది. భద్రతా బలగాలు- మావోయిస్టుల మధ్య జరిగిన భీకర కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ కాల్పుల్లో ఒక జవాన్‌ కూడా ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. యాంటీ నక్సల్‌ సెర్చ్‌ ఆపరేషన్‌లో భాగంగా ఈనెల 3వ తేదీన కొండెగావ్, నారాయణపుర్, దంతెవాడ, జగదల్‌పుర్‌కు చెందిన డీఆర్జీ, ఎస్టీఎఫ్‌ జవాన్లు కలిసి సంయుక్తంగా అబూజ్‌మడ్‌ అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహించారు. అయితే శనివారం సాయంత్రం నుంచి మావోయిస్టులు-భద్రతా బలగాల మధ్య కొన్ని ప్రాంతాల్లో ఎదురు కాల్పులు జరుగుతుండగా.. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభం అయిన కాల్పులు నాన్‌స్టాప్‌గా 2 గంటలు జరిగాయి. ఇక మృతి చెందిన నలుగురు మావోయిస్టుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos