మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర బలగాలు చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్ ఐదో రోజుకు చేరింది. తెలంగాణ, ఛత్తీస్‌గడ్, మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న కర్రెగుట్టలో జరిగిన ఎన్‌కౌంటర్ లో భారీగా మావోయిస్టులు మృతిచెందారు. కర్రెగుట్టలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా కేంద్ర పారామిలిటరీ బలగాలు, మావోయిస్టుల మధ్య  కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఇదివరకే ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం అందగా.. శనివారం నాడు ఆ సంఖ్య 28కి చేరినట్లు తెలుస్తోంది. అధికారులు ఈ సంఖ్యను ధ్రువీకరించాల్సి ఉంది.

కేంద్ర పాలరామిలటరీ బలగాల నేతృత్వంలో కర్రెగుట్టలో గత కొన్ని రోజుల నుంచి కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఏరియల్ సర్వే ద్వారా ఎప్పటికప్పుడు బలగాలకు సమాచారం అందుతోంది. మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ అయిన హిడ్మా, దేవ టార్గెట్ గా  కూంబింగ్ కొనసాగుతున్నట్లు సమాచారం. వేల మంది బలగాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయని, మావోయిస్టులను రౌండప్ చేశాయని శుక్రవారం ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కాల్పులకు సంబంధించి బిగ్ అప్ డేట్ వచ్చింది. కర్రెగుట్టలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు చనిపోయినట్లు సమాచారం. ఇదే నిజమైతే మావోయిస్టులకు ఇది మరో పెద్దదెబ్బ అని చెప్పవచ్చు. 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెబుతున్నారు. అందులో భాగంగానే బలగాలు వీలు చిక్కినప్పుడల్లా కూంబింగ్ చేపట్టి మావోయిస్టులను ఏరివేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మొత్తానికి కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 28 మంది వరకు మావోయిస్టులు చనిపోయారని తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. దాదాపు మూడు, నాలుగు రాష్ట్రాల నుంచి బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొనడం, ఊహించని రీతిలో కూంబింగ్ చేపట్టడంతో మావోయిస్టులకు మరోదారి లేకుండా పోయింది. ఈ క్రమంలో బలగాలకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఇదివరకే వందల మంది మావోయిస్టులు భద్రతా బలగాల కాల్పుల్లో మరణించారు. అడవులను వదిలి జన జీవన స్రవంతిలో కలిసి పోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు సూచిస్తున్నారు. కొందరు మావోయిస్టులు పోలీస్ అధికారుల ఎదుట లొంగిపోయి వారి మీద ఉన్న రివార్డు అవార్డును సొంతం చేసుకుంటున్నారు. మరికొందరు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొంది కొత్త జీవితం మొదలుపెడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos