డిల్లీ బాంబ్ బ్లాస్ట్ ను మర్చిపోకముందే జమ్మూ కశ్మీర్ లో మరో బాంబు బ్లాస్ట్ జరిగింది. జమ్మూ కశ్మీర్ శ్రీనగర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం రాత్రి భారీ శబ్దంతో ఈ బాంబు బ్లాస్ట్ జరగడంతో పరిసర ప్రాంతాలన్నీ కంపించి పోయాయి. శుక్రవారం రాత్రి సుమారు 11:45 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందగా 30 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులంతా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
సీనియర్ పోలీస్ అధికారులు నౌగామ్‌కు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. పేలుడు సమాచారం అందిన వెంటనే చాలా అంబులెన్సులు, ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. పోలీస్ స్టేషన్ లోపల, చుట్టుపక్కల చాలా నష్టం జరిగింది. కాశ్మీర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్ చాలా ముఖ్యమైంది. ఎందుకంటే, ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న అంతర్ రాష్ట్ర టెర్రర్ మాడ్యూల్ కేసుకు సంబంధించిన మొదటి ఎఫ్ఐఆర్ ఇక్కడే నమోదైంది. ప్రస్తుతం పోలీసులు స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
పోలీస్ అధికారులు, ఒక ఎఫ్ఎస్ఎల్ బృందం ప్రాంగణంలో తనిఖీలు చేస్తుండగా ఈ పేలుడు జరిగింది. ఇటీవల హర్యానాలోని ఫరీదాబాద్‌లో 'వైట్‌కాలర్' టెర్రర్ మాడ్యూల్ కేసులో స్వాధీనం చేసుకున్న అమ్మోనియం నైట్రేట్ నిల్వ నుంచి అధికారులు నమూనాలు సేకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రాంగణంలో ఉన్న చాలా వాహనాలు దెబ్బతిన్నాయి. ఘటన జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లే అన్నిదారులను మూసివేశారు. కాగా ఇది ఉగ్రదాడి కాదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అక్కడి పోలీసులు పేర్కొన్నారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos