దావోస్: అన్నివిధాల అనుకూల వాతావరణం కలిగిన విశాఖపట్నంలో సిస్కో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ (GCC) ఏర్పాటుచేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ప్రముఖ బహుళజాతి ఐటిసంస్థ సిస్కో వైస్ ప్రెసిడెంట్ ప్రాన్సిన్  కట్సౌదాస్ తో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా వైజాగ్, విజయవాడ, తిరుపతి పరిసరాల్లో అనువైన స్థలం, ప్రతిభకలిగిన ఐటి వృత్తినిపుణులు అందుబాటులో ఉన్నారు.  USAలోని భారతీయ IT వర్క్‌ఫోర్స్‌లో 25% పైగా తెలుగు కమ్యూనిటీకి చెందిన వారు ఉన్నారు. భారతదేశంలో ఎపి అతిపెద్ద ఐటి పూల్‌లలో ఒకటిగా ఉంది.ఎఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, పునరుత్పాదక ఇంధనరంగాల్లో నైపుణ్యాభివృద్ధి ద్వారా డీప్-టెక్ హబ్‌గా మారడంపై దృష్టి సారించాం. అతిపెద్ద టాలెంట్ పూల్‌ ఉన్న దృష్ట్యా కంపెనీ దీర్ఘకాల వ్యూహానికి ఎపి అనువుగా ఉంటుంది. అన్నివిధాలా అనుకూలతలు కలిగిన ఎపిలో కంపెనీ తయారీ నెట్‌వర్క్‌ను విస్తరించండి. అతిపెద్ద ఐటి పూల్ కలిగిన ఎపిలో ఎఐ, నెట్‌వర్కింగ్, సైబర్‌సెక్యూరిటీలో అత్యంత నైపుణ్యం కలిగిన IT వర్క్‌ఫోర్స్‌ను రూపొందించడానికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు.

సిస్కో వైస్ ప్రెసిడెంట్ ఫ్రాన్సిస్ కట్సౌదాస్ మాట్లాడుతూ... సాఫ్ట్ వేర్, నెట్ వర్క్, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ లో అగ్రగామిగా ఉన్న సిస్కో సిస్టమ్స్ 80 కంటే ఎక్కువ దేశాల్లో 200కి పైగా కార్పొరేట్ కార్యాలయాలతో 84వేల మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉందని తెలిపారు. 2024 ఆర్థిక సంవత్సరంలో $54 బిలియన్ల ఆదాయం (రూ.4.6 లక్షల కోట్లు) సాధించిన సిస్కో నెట్‌వర్కింగ్ (ఈథర్‌నెట్, ఆప్టికల్, వైర్‌లెస్, మొబిలిటీ), డాటా భద్రత, సహకారం (వాయిస్, వీడియో, డేటా), డేటా సెంటర్‌లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) వంటి రంగాల్లో సాంకేతిక సేవలను అందిస్తోందని తెలిపారు.  యుఎస్ వెలుపల సిస్కో అతిపెద్ద గ్లోబల్ డెవలప్ మెంట్ సెంటర్ బెంగుళూరులో పనిచేస్తోంది. బెంగుళూరులో విప్రో, ఇన్ఫోసిస్ లతో జాయింట్ డెవలప్ మెంట్ సెంటర్లు ఉన్నాయి. గో టు మార్కెట్ వ్యూహంతో ప్రపంచవ్యాప్తంగా 2500కు పైగా ఐటి కంపెనీల భాగస్వామ్యం కలిగి ఉన్నాం. భారత్ లో త్వరలో 1.5 బిలియన్ డాలర్లు వెచ్చించి ఫ్లెక్స్ సంస్థ తయారీ భాగస్వామిగా కాంట్రాక్ట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. సమర్థవంతమైన మానవవనరుల కోసం భారత్ లో కార్యకలాపాలపై దృష్టిసారించాం. ఇందులో భాగంగా 5లక్షలమంది సైబర్ సెక్యూరిటీ నిపుణులకు శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నాం. సిస్కో ద్వారా శిక్షణ పొందిన వారిలో 95శాతం మంది మంచి ఉద్యోగాలను సాధించడం, ఉన్నత విద్యావకాశాలను పొందుతున్నారు. ఏపీ ప్రతిపాదనలపై కంపెనీలోని సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కట్సౌదాస్ చెప్పారు.

Related Videos