రేపు మధ్యాహ్నం అంటే ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు అయోధ్యలోని బాలరాముడి ఆలయంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. చైత్రశుద్ధ నవమి రోజున శ్రీరాముడు జన్మించాడు. అందుకే శ్రీరామనవమిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు పెద్ద పండుగలా జరుపుకుంటారు.అదే రోజున సీతారాముల కల్యాణాన్ని నిర్వహిస్తారు. ఇప్పటికే శ్రీరామనవమి ముందస్తు వేడుకలు దేశవ్యాప్తంగా ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. రేపు బాలరాముడికి సూర్యభగవానుడు సూర్య తిలకం దిద్దే దృశ్యాలు భక్తులు వీక్షించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఈ అద్బుత దృశ్యం కనువిందు చేయనుంది. గత ఏడాది  శ్రీరామనవమికి తొలిసారి ఆదిత్య భగవానుడు డిస్ బాలరాముడిని తాకిన విషయం తెలిసిందే. ప్రతి ఏడాది శ్రీరామనవమికి బాలరాముడి నుదిటి పైకి భానుడి కిరణాలు ప్రసరించేలా ఆలయాన్ని నిర్మించారు. కాంతి గుడి శిఖరాన్ని తాకే మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోని విగ్రహాన్ని చేరేలా కుంభాకాvర, పుటాకార కటకాలను నిర్మాణ సమయంలో అమర్చిన విషయం తెలిసిందే.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos