జమిలి దిశగా మోదీ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. దక్షిణాదిన ఏపీ మినహా ఇతర రాష్ట్రాల్లో పట్టు చిక్కటం లేదు. దీంతో, పవన్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు పవన్ ఆపరేషన్ సౌత్ మొదలు పెడుతున్నారు. ఇందుకు ముహూర్తం ఖరారైంది. ఢిల్లీ కేంద్రంగా మంత్రాంగం సాగుతోంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్.. ఇప్పుడు ఏపీతో పాటుగా దక్షిణాది రాష్ట్రాల పైన ఫోకస్ చేసారు. డిప్యూటీ సీఎం అయిన తరువాత పవన్ వారాహీ దీక్ష చేసారు. తిరుపతి లడ్డూ వివాదం వేళ ప్రాయాశ్చిత దీక్ష నిర్వహిం చారు. సనాతన ధర్మం గురించి పవన్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చగా మారాయి. ఇక, ఇప్పుడు తిరిగి పవన్ ఎన్డీఏ భవిష్యత్ కోసం కీలక బాధ్యతలు తీసుకుంటున్నారు.

దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు కోసం బీజేపీ పవన్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. అందులో భాగంగా పవన్ ముందుగా తమిళనాడు, కేరళలో ప్రముఖ ఆలయాల సందర్శనకు సిద్దమయ్యారు. ఈనెల 12వ తేది నుంచి కేరళ, తమిళనాడులో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. నాలుగు రోజుల పాటు ఈ రెండు రాష్ట్రాల్లోని అనంతపద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరుస రామ స్వామి, అగస్థ్యజీవసమాధి కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకుంటారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుపై పవన్ చేసిన డిమాండ్ కు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు మద్దతుగా నిలిచారు.

ఏపీతో సహా తెలంగాణ, కేరళ, తమిళనాడులో ఎన్డీఏ బలోపేతం దిశగా బీజేపీ వ్యూహాలకు పవన్ పూర్తి మద్దతు ఇస్తున్నారు. పవన్ డిమాండ్ చేస్తున్న సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు డిమాండ్ కు ఆరెస్సెస్ ముఖ్య నేతలు సైతం మద్దతు ఇచ్చారు. పవన్ తాజా పర్యటన దేవాలయాల సందర్శన కోసమే అయినా.. రాజకీయ భవిష్యత్ కోసం వేస్తున్న కీలక అడుగుగా విశ్లేషణలు వస్తున్నాయి. ఇటు ఏపీలో నూ జనసేన ప్లీనరీ వేదిక నుంచి పవన్ రాజకీయంగా కీలక నిర్ణయాల ప్రకటనకు సిద్దం అవుతున్నారు. పవన్ తాజా నిర్ణయం దక్షిణాదిన రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. బీజేపీ వేసిన ట్రాప్ లో పడిన పవన్ ... రాజకీయంగా మునుగుతారా లేదా తేలుతారా అన్నది భవిష్యత్తులో తెలుస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos