కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు.. ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. ఉద్యోగులకు 3 శాతం డీఏ(కరవు భత్యం) పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం భేటీ అయిన కేంద్ర కేబినెట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకు 50 శాతంగా ఉన్న డీఏ.. ప్రస్తుతం 53 శాతానికి పెరిగింది. ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచుతుండగా.. ఈ ఏడాది మార్చిలో పెంచగా.. ప్రస్తుతం మరోసారి పెంచారు. మార్చిలో 4 శాతం పెరిగిన డీఏ.. తాజాగా మరో 3 శాతం పెరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ మొత్తంగా 53 శాతానికి పెరిగింది.

కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు డీఏ(డియర్‌నెస్ అలవెన్స్), కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నుంచి రిటైర్ అయిన పెన్షనర్లకు డీఆర్‌ (డియర్‌నెస్‌ రిలీఫ్‌) 3 శాతం పెరిగింది. దీంతో ఉద్యోగులకు వారి బేసిక్ సాలరీలో ఈ డీఏ పెంపు ఉంటుంది. ఈ పెంపు 2024 జులై 1వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కేంద్ర కేబినెట్ తీసుకున్న డీఏ పెంపు నిర్ణయంతో ప్రస్తుతం రూ.18 వేలు బేసిక్‌ వేతనం అందుకుంటున్న ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి.. అదనంగా రూ.540 అందుకుంటారని తెలుస్తోంది.

దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఏటా రెండు సార్లు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), డీఆర్‌(డియర్‌నెస్‌ రిలీఫ్‌)లో మార్పులు చేస్తూ ఉంటుంది. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల 1.16 కోట్ల మందికిపైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్‌లకు లబ్ధి చేకూరనుంది. సాధారణంగా డీఏ పెంపు ఏడాదిలో రెండుసార్లు ప్రకటిస్తారు. మార్చిలో హోళీ పండగ సమయంలో ఒకసారి.. దీపావళి పండగ నేపథ్యంలో అక్టోబర్‌-నవంబర్‌ సమయంలో రెండోసారి కేంద్రం ప్రకటిస్తుంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Take Oath As A TDP National Working President | CM Chandrababu | AG

తాజా వార్తలు

15-49-17-0617.jpg

మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం.. ఆర్టీజీఎస్ పై సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
2026-06-22 Time: 03:49:17

15-31-26-0626.jpg

ప్రజా ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టులు.. 4 అంశాలపై ప్రోగ్రెస్ రిపోర్టులను విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు
2026-06-22 Time: 03:31:26

17-02-16-0616.jpg

అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు.. చిన్నారులతో కలిసి రాగి జావ తీసుకున్న చంద్రబాబు
2026-06-20 Time: 05:02:16

14-06-28-0628.jpg

90వ రోజు ప్రజాదర్బార్.. వివిధ సమస్యలపై ప్రజల  వినతుల స్వీకరణ.. అన్నివిధాల అండగా ఉంటానట్టు  మంత్రి లోకేష్ హామీ
2026-06-16 Time: 02:06:28

14-04-35-0635.jpg

సెమీకండక్టర్ల తయారీకి ఏపీ బెస్ట్ డెస్టినేషన్.. సింగపూర్‌లో సెమీకండక్టర్లపై సెమీకాన్ ఎకోసిస్టమ్ సదస్సులో సీఎం చంద్రబాబు
2026-06-16 Time: 02:04:35

Related Videos