పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఆ ప్రభావం ప్రపంచదేశాలతో పాటుగా భారత్ పై పడుతోంది. ఈ మేరకు భారత్ లో ఇంధన కొరత నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ రేపు శుక్రవారం మార్చి 27న సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు కీలక సమావేశం నిర్వహించనున్నారు. దిల్లీలోని తన అధికారిక నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఇక రెండు రోజుల క్రితం త్రివిధ దళాధిపతులతో కేంద్రం సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. అలాగే నిన్న అఖిలపక్ష భేటీ నిర్వహించారు. మరోవైపు రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ భేటీ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య యుద్ధం అంతకంతకూ పెరుగుతోంది. నాలుగు వారాలుగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఓవైపు యుద్ధాన్ని ముగించేందుకు సంధి చర్చలు జరుగుతున్నా అవి ఫలించడం లేదు. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 15 పాయింట్ల ప్రణాళికను ఇరాన్ తిరస్కరించింది. దాంతో ఇరాన్ - అమెరికా మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ - ఇజ్రాయెల్ - అమెరికా యుద్ధం ఇప్పుడు ప్రపంచదేశాల్ని అతలాకుతలం చేస్తోంది. ఈ యుద్ధ మేఘాల ప్రభావం భారత్‌ పైనా పడుతోంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ (LPG) సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చమురు సరఫరాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన నేపథ్యంలో పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మార్చి 27 సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ భేటీలో పలు అంశాలపై చర్చించనున్నారు. యుద్ధం కారణంగా భారత్‌ లో గ్యాస్, పెట్రోల్ కష్టాలు మొదలయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్న తరుణంలో ప్రధాని మోదీ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos