భారత్లో మళ్లీ ఎన్నికల నగరా మోగింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కేంద్ర ఎన్నికల సంఘం నిన్న ఆదివారం విడుదల చేసింది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం కలిపి దేశ జనాభాలో దాదాపు 5వ వంతు భాగం. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఎన్నికల తేదీలు వెల్లడించారు. అస్సాం, పుదుచ్చేరి, కేరళలో మార్చి 16న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అదేరోజు నుంచి మార్చి 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 24న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు మార్చి 26న ముగియనుంది. ఏప్రిల్ 9న ఎన్నికలు నిర్వహించి, మే 4న ఓట్లు లెక్కించి విజేతను ప్రకటిస్తారు. అదేవిధంగా తమిళనాడులో మార్చి 30న అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం 234 స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి, మే 4న ఓట్ల లెక్కింపు చేపడతారు.
మరోవైపు పశ్చిమ బెంగాల్ లో తొలి దశలో 152 నియోజకవర్గాల్లో, రెండో దశలో 142 నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. బెంగాల్లో తొలి దశ ఎన్నికలు ఏప్రిల్ 23న, రెండో దశ ఎన్నికలు ఏప్రిల్ 29న నిర్వహించి ఈసీ ఓట్ల లెక్కింపు మే 4వ తేదీన చేపట్టి విజేతల్ని ప్రకటించనుంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ గడువు 7 మే 2026న ముగియనుంది. తమిళనాడు అసెంబ్లీ మే 10, అస్సాం అసెంబ్లీ గడువు మే 20, కేరళ మే 23న, పుదుచ్చేరి అసెంబ్లీ గడువు జూన్ 15తో ముగియనుంది. త్వరలో ఎన్నికలు జరగనున్న ఈ 4 రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో దాదాపు 20 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. వీటి జనాభా కలిపి దేశ మొత్తం జనాభాలో సుమారు 17-18 శాతం ఉంది. ఈ రాష్ట్రాల నుంచి లోక్సభకు 116 మంది ఎంపీలు ఎన్నికవుతారు. ఇది మొత్తం 543 సీట్లలో సుమారు 21 శాతం. రాజ్యసభకు కూడా ఈ రాష్ట్రాల ఎమ్మెల్యేలు కలిసి 51 మంది సభ్యులను (సుమారు 21 శాతం) పంపిస్తారు. ఈ ఎన్నికల్లో గెలిచే పార్టీల ప్రభావం పార్లమెంటులో కూడా పెరిగిపోతుంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos