ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి సమాయాత్తమవుతున్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. కాంగ్రెస్ కూడా సొంతంగా బరిలో దిగితే త్రిముఖ పోటీ ఏర్పడటం ఖాయమవుతుంది. ముందుగా ఊహించినట్టే ఫిబ్రవరి మొదటివారంలో ఈ ఎన్నకలు షెడ్యూల్ అయ్యాయి. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ మేరకు ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లోని ప్లానెరీ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధుతో కలిసి మాట్లాడారు.

ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అదే నెల 8వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్.. 36. దేశ రాజధాని ఢిల్లీలో 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ జెండా పాతింది. ఆ పార్టీ ఓటుబ్యాంక్ అప్పటినుంచి ఇఫ్పటివరకూ చెక్కు చెదరట్లేదు. 1998లో చివరిసారిగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీని పాలించింది. 2013లో కాంగ్రెస్ ఇక్కడ అధికారాన్ని కోల్పోయింది. అప్పటి నుంచీ ఈ రెండు పార్టీలను కాదని ఆమ్ ఆద్మీకే పట్టం కడుతూ వస్తున్నారు ఢిల్లీ ఓటర్లు. భారీ మెజారిటీతో ఆప్ అభ్యర్థులను గెలిపిస్తూ వస్తున్నారు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌కు ఏ మాత్రం కొరుకుడు పడట్లేదు హస్తినాపురి ఓటరు మనస్తత్వం.

ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నాయి ఈ రెండు పార్టీలు. ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల జాబితాలనూ ఆయా పార్టీలు దశలవారీగా  ప్రకటిస్తున్నాయి. బీజేపీ ఇటీవలే తొలి జాబితాను ప్రకటించగా .. ఆప్ పార్టీ ఇప్పటికే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos