దక్షిణాది రాష్ట్రాలను తీవ్ర ఆందోళనలోకి నెడుతున్న అంశం - డీలిమిటేషన్. 2026 నాటికి జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాలను పునర్విభజించాలంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఆశించిన స్థాయిలో సీట్ల సంఖ్య పెరగదని ఇక్కడి ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న డీలిమిటేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా సరికొత్త ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకుని రావడానికి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా దక్షిణాదిన బీజేపీ- మిత్రపక్షాలేతర ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల అధినాయకులతో నేడు సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

చెన్నైలోని ఓ హోటల్ దీనికి వేదిక కానుంది. ఫెయిర్ డీలిమిటేషన్ అనేది ఈ భేటీ ప్రధాన డిమాండ్. దీనికి హాజరు కావాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినీ ఆహ్వానించారు స్టాలిన్. అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భేటీకి హాజరు కానున్నారు. డీలిమిటేషన్ ప్రక్రియను రేవంత్ రెడ్డి తప్పుపడుతున్నారు. బీజేపీ-ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై కుట్ర పన్నుతోందంటూ రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. ఇది డీలిమిటేషన్ కాదని, దక్షిణాది రాష్ట్రాలను లిమిట్ చేయడమేనని ఆరోపించారు. తాము దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తేల్చి చెప్పారు.

తమకు ఏనాడూ ఓటు వేయని దక్షిణాది రాష్ట్రాల ప్రజలపై ఉన్న ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి బీజేపీ ఇదంతా చేస్తోందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ ఏకంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజల మీదే ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా ఉద్యమించాలంటూ స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని, ఆయన వైఖరిని స్వాగతిస్తున్నానని చెప్పారు. కాగా ఈ భేటీకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హాజరయ్యే అవకాశం కనిపించడం లేదని వార్తలు వస్తున్నాయి. దక్షిణాదికి అన్యాయం జరుగుతుందా లేదా అన్న అభిప్రాయాన్ని చెప్పడానికి కూడా జగన్ వణికిపోతున్నారు. బీజేపీని వ్యతిరేకిస్తే తన పరిస్థితి ఏమిటో ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆ పార్టీ అధిష్టానం విదిలించేస్తున్నా సరే జగన్ ఆ పార్టీని వదిలి పెట్టడం లేదు. ఎన్డీఏ కూటమికి ఆయన ఢిల్లీలో మద్దతు తెలియచేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి రాజకీయాలు చేస్తే జగన్ కు రాజకీయ భవిష్యత్ అనేది ఉండదని.. పోరాడాలని శ్రేయోభిలాషులు అదే పనిగా సలహాలిస్తున్నారు. కానీ జగన్ మాత్రం పోరాడితే జైలుకు పోతామని.. పార్టీ పోతుందని గట్టి క్లారిటీగా ఉన్నారని, అందుకే రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos