దరాబాద్‌ లోని ఫిలింనగర్ లో ఉన్న దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో దగ్గుబాటి ఫ్యామిలీకి బిగ్ షాక్ తగిలింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు.. సినీ నటులు దగ్గుబాటి వెంకటేశ్‌, రానా, అభిరామ్, సురేష్ బాబు నవంబర్ 14న తప్పనిసరిగా న్యాయస్థానానికి రావాలని ఆదేశించింది. పర్సనల్ బాండ్ సమర్పించేందుకు కచ్చితంగా రావాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారం అటు సినీ వర్గాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అసలు విషయం ఏమిటంటే.. దక్కన్ కిచెన్ హోటల్ భూమికి సంబంధించి నందకుమార్ అనే వ్యక్తికి దగ్గుబాటి కుటుంబానికి మధ్య పొలానికి సంబంధించిన వివాదం గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతోంది. నందకుమార్ 2022లో సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. దాంతో స్థలాన్ని విస్తరించేందుకు చర్యలు తీసుకోకూడదని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ అదే సంవత్సరం నవంబరులో GHMC అధికారులు బౌన్సర్ల సాయంతో హోటల్‌ను పాక్షికంగా కూల్చారు. ఆ తర్వాత 2024 జనవరిలో దగ్గుబాటి కుటుంబ సభ్యులు.. హోటల్‌ను పూర్తిగా కూల్చివేశారు. ఈ చర్యలపై నందకుమార్ తిరిగి నాంపల్లి కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఫిల్మ్‌నగర్ పోలీసులను కేసు నమోదు చేయాలని ఆదేశించింది. పోలీసులు పలు ఐపీసీ సెక్షన్ల కింద వెంకటేశ్, సురేష్ బాబు, రానా మీద కేసులు నమోదు చేశారు. గతంలో కూడా వెంకటేష్, రానా విచారణకు హాజరుకాలేదన్న కారణంగా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు ఆలస్యం చేస్తూ కాలయాపన చేస్తుండటంపై కోర్టు సీరియస్ అయ్యింది.

తెలుగు చిత్రపరిశ్రమలో దగ్గుబాటి ఫ్యామిలీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సీనియర్ నిర్మాతగా రామానాయుడు వారసత్వాన్ని కొనసాగిస్తూ వెంకటేష్ హీరోగా రాణిస్తుంటే.. సురేష్ బాబు ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందారు. వారి బాటలోనే ఇప్పుడు రానా సైతం తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. రీసెంట్ గానే వెంకటేష్.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా భారీ విజయాన్ని సాధించింది. రీజనల్ ఫిల్మ్‌గా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది.

Related Videos