తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ... రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. ఆయా పార్టీల్లో సుమారు రెండు మూడునెలల కిందటే ప్రారంభమైన ఆయారాం-గయారాం ప్రక్రియ ఇప్పుడు వేగం పుంజుకునే వాతావరణం కనిపిస్తోంది. తాజాగా... హైదరాబాద్ లోని మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సహా పలువురు నేతలు ... కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌లో చేరినవారిలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు. మల్లికార్జున ఖర్గే వారికి కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే తదితరులు ఉన్నారు. మైనంపల్లి హన్మంతరావుకు బీఆర్ఎస్ మల్కాజిగిరి టిక్కెట్ ఇచ్చింది. అయితే తన తనయుడికి మెదక్ టిక్కెట్ రాకపోవడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఢిల్లీలోని ఖర్గే నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్ రావు కాక్రే తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కేసీఆర్ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో మల్కాజ్ గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు పేరు ఉంది. అయితే తనతో పాటు,  తన కుమారుడు రోహిత్ కు మెదక్ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాల్సిందేనని మైనంపల్లి పట్టుపట్టారు. అభ్యర్థుల పేర్ల ప్రకటనకు ముందు రోజే తెలంగాణ మంత్రి హరీష్ రావు పై మైనంపల్లి హనుమంతరావు సంచలన విమర్శలు చేశారు. ఇక ఆ తర్వాత నుంచి మైనంపల్లి వ్యవహారం బీఆర్ఎస్ కు పెద్ద తలనొప్పి గానే మారింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మైనంపల్లి నిష్ర్కమణ తరువాత మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ నాయకత్వం మరో అభ్యర్థిని వెతుకుతోంది. మరోవైపు... వేముల వీరేశం చేరికకు సంబంధించి చివరి వరకు ఉత్కంఠనే కొనసాగింది. వాస్తవానికి వేముల వీరేశం పార్టీలో చేరతారు.. ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, రేపో మాపో కండువా కప్పేసుకుంటారని ప్రచారం జరిగిన నాటి నుంచి పరిశిలీస్తే.. వీరేశం తప్ప రాష్ట్రంలో పలువురు నాయకులు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, భువనగిరికి చెందిన జిట్టా బాలక్రిష్ణారెడ్డి, మహబూబ్ నగర్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి చేరిక త్వరగానే అయిపోయింది. ఆ తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఖమ్మం జిల్లా నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సైతం కాంగ్రెస్ లో చేరిపోయారు. రెండు నెలల కిందటే తన డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి కారెక్కిన భువనగిరి నాయకుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అక్కడ ఇమడ లేక.. సొంతగూటికి చేరారు. సో... రాష్ట్రంలో బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చి ... కాంగ్రెస్ లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ఆ పార్టీలో కొత్త జోష్ నెలకొంది.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos