కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్డీయే కూటమిలో జేడీఎస్ పార్టీ చేరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో ఢిల్లీలో జేడీఎస్ అగ్రనేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి భేటీ అయ్యారు. వీరి సమావేశం ముగియగానే ఎన్డీయేలో చేరినట్లు కుమారస్వామి ప్రకటించారు. పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఎన్డీయేలో జేడీఎస్ చేరడంతో కర్ణాటక రాజకీయాలు ఏ విధంగా మారబోతాయనేది ఆసక్తికరంగా మారింది. తాజా పరిణామంతో జేడీఎస్ పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో కలిసి నడవనుందనేది స్పష్టమైంది. కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ... జేడీఎస్ ... అనుకున్న స్థాయిలో సీట్లు రాబట్టలేకపోయింది. బలమైన ఓటు బ్యాంకు ఉన్న చోట కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. కింగ్ మేకర్ తానే అని మొదటి నుంచి చెప్పుకున్న కుమారస్వామి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరవాత సైలెంట్ అయిపోయారు. ఇక... అప్పటినుంచి అంతర్గతంగా బీజేపీతో మంతనాలు జరుపుతూ వచ్చారు.  మంతనాలు సక్సెస్ అయిన క్రమంలో ఎన్డీయే కూటమితో జట్టు కట్టారు. అయితే సీట్ల షేరింగ్ కు సంబంధించి మాత్రం ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా జేపీ నడ్డా స్పందిస్తూ... ఎన్డీయేలో భాగస్వామి కావాలని జేడీఎస్ నిర్ణయించుకోవడం సంతోషకరమని... వారిని ఎన్డీయే కూటమిలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని అన్నారు. న్యూ ఇండియా, స్ట్రాంగ్ ఇండియా అనే ప్రధాని మోదీ విజన్ ను ఈ చేరిక మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. కాగా... బీజేపీ, జేడీఎస్‌ పొత్తు ఊహించిందేనని, దీని ప్రభావం తమపై ఏమాత్రం ఉండబోదని, ప్రజలు తమ పక్షానే ఉన్నారని కేపీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ అన్నారు. మరోవైపు బీఆర్ఎస్  అధినేత కేసీఆర్... టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన తొలినాళ్లలోనే జేడీఎస్ నేత కుమారస్వామితో  క్లోజ్ గా మూవ్ అయ్యారు. కుమారస్వామి సహకారంతో ఆ రాష్ట్రంలో బలోపేతం కావాలని మొదట కర్ణాటకపైనే ఫోకస్ పెట్టారు. ఈ కారణంగానే ఆ రాష్ట్రం లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా  దేవెగౌడ, కుమార స్వామిలను కలిశారు. రెండు పార్టీలు కలిసి నడిచేందుకు సిద్ధమైనట్లుగానూ కనిపించింది. కానీ, ఇప్పుడు ఎన్డీఏలోకి వెళ్లిన జేడీఎస్... ఆ కూటమికి వ్యతిరేకి అయిన బీఆర్ఎస్ అధినేతకు షాక్ ఇవ్వడం అనూహ్య పరిణామం. దీనిపై తెలంగాణ సీఎం ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos