కేంద్ర మంత్రులతో సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన నారా లోకేష్ మంగళవారం సాయంత్రం కేంద్రమంత్రి అశ్వని వైష్ణవ్ తో సమావేశం అయ్యారు. ఏఐ ఎక్సలెన్స్ సెంటర్ ను కేంద్రం ప్రారంభించాలని భావిస్తున్న క్రమంలో.. దాన్ని విశాఖలో పెట్టాలని లోకేష్ కోరారు. మరికొన్ని కీలక అంశాలపై చర్చలు జరిపారు. బుధవారం కూడా నారా లోకేష్ డిల్లీలోనే ఉన్నారు. ఆయన పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నారు.
మరోవైపు లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఏపీ రాజకీయాలపై చర్చలు కూడా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఆయన ఓ ప్రత్యేకమైన ఎజెండాతో ఢిల్లీకి వెళుతున్నారని.. అదేమిటో బయటకు రాదని టీడీపీ వర్గాలంటున్నాయి. వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై కేంద్ర స్థాయిలో చర్యలు ఉండేలా పకడ్బందీగా అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు.
మరోవైపు.. ఇటీవల ఏపీ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ .. లోకేష్ తనను కలవకపోవడంపై సరదాగా అసంతృప్తి వ్యక్తం చేశారు. కుటుంబంతో సహా వచ్చి కలవాలన్నారు. త్వరలోనే వచ్చి కలుస్తానని లోకేష్ చెప్పారు. ప్రధాని మోదీ బిజీగా లేని సందర్భం చూసుకుని ఆయనతో లోకేష్ సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికలు , పార్లమెంట్ సమావేశాలతో బిజీగా ఉన్నందున… ఈ సారి ప్రధానితో భేటీ అయ్యే అవకాశం లేదని భావిస్తున్నారు. ఏది ఏమైనా.. ఏపీ రాష్ట్రానికి సంబంధించి లోకేష్ .. ఢిల్లీలో కీలకంగా వ్యవహరిస్తుండటంపై ఆ పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos