ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరిగిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ.... కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ... అవినీతి ఆరోపణలు లేని ప్రాజెక్టు తెలంగాణలో లేదని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం రోజూ నాలుగు పనులే చేస్తోందని... ఉదయం నుంచి సాయంత్రం వరకు మోడీని తిట్టడం మొదటి పని అయితే... కుటుంబ పార్టీని పెంచి పోషించడం రెండో పనిగా చెప్పారు.
తెలంగాణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడం మూడో పనిగా పెట్టుకున్నారని ... నాలుగో పనిగా తెలంగాణను అవినీతిలో కూరుకుపోయేలా చేస్తున్నారని మోడీ ధ్వజమెత్తారు. గతంలో రెండు రాష్ట్రాల మధ్య అభివృద్ధి కోసం ఒప్పందాలు జరిగేవని .. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య అవినీతి ఒప్పందాలు జరుగుతున్నాయని ఢిల్లీ, తెలంగాణ ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. ఇక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వం కోట్ల రూపాయల అవినీతి ఆరోపణల ఎదుర్కొంటోందని... అవన్నీ ఇప్పుడు బహిర్గతమయ్యాయని అన్నారు.
ఇప్పుడు వాటి నుంచి మైండ్ డైవర్ట్ చేయడానికి కేసీఆర్ కొత్త వ్యూహాలు పన్నుతున్నారని అన్నారు. ఆ వ్యూహాల నుంచి ఆలోచనల నుంచి ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మోడీ. కేంద్రప్రభుత్వం తెలంగాణ గ్రామపంచాయతీలకు నేరుగా నిధులు ఇస్తోందని .... గ్రామీణాభివృద్ధి కోసం ఎన్నో పనులు కేంద్రం చేస్తోందని మోడీ అన్నారు. దేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేశామని ... అందులో ఒకటి తెలంగాణకు కేటాయించామన్నారు. దళితులు, బలహీన వర్గాలను తెలంగాణ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ 'తెలంగాణ ప్రజలందరికీ నా అభినందనలు' అంటూ మాట్లాడారు.
ప్రసంగానికి ముందు... మోడీ.. వర్చువల్ గా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. జాతీయ రహదారులు, రైల్వే ఉత్పాదక కేంద్రాలకు శంకుస్థాపన చేశారు. మేడ్చల్-వరంగల్ మధ్య 108 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టుకు శంకుస్ధాపన చేశారు. నాగపూర్-విజయవాడ కారిడార్ కు సంబంధించి రెండు జాతీయ రహదారులపై వాహనదారులకు ... దీనివల్ల 34 కిలో మీటర్ల మేర ప్రయాణం తగ్గుతుంది. అలాగే... కరీంనగర్-వరంగల్ సెక్షన్ లో ప్రస్తుతం ఉన్న రెండు లైన్ల రహదారిని నాలుగు లైన్లకు విస్తరించే పనులకు కూడా ప్రధాని పునాదిరాయి వేశారు. దీనివల్ల హైదరాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్ లో ముఖ్యంగా కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్, వరంగల్ సెజ్ లకు కనెక్టివిటీ గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్, కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఇదిలావుండగా... నరేంద్ర మోడీ ఎన్నికలకు ముందు చేస్తున్న ఈ పర్యటన కారణంగా... బీజేపీ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తోంది. 30 ఏళ్ళ తర్వాత ప్రధాని వరంగల్ కు రావటంతో ఓరుగల్లు కాషాయవర్ణంగా మారింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి బీజేపీ నేతలు, శ్రేణులు ప్రధాని సభకు భారీగా చేరుకున్నారు. ట్రాఫిక్ ఆంక్షలతో విపరీతమైన ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. వివిధ ప్రాంతాల నుంచి వాహనాలు వస్తుండటంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos