ఈ ఏడాది చివరిలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగనున్న క్రమంలో ... జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. కర్ణాటకలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్ తో కాంగ్రెస్ పార్టీ ఎంతో ఉత్సాహంతో సమరశంఖం పూరించేందుకు సిద్ధంగా ఉంది. ఈ మేరకు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కసరత్తులు చేపట్టింది. దక్షిణాదిన తీసుకుంటే... త్వరలో జరగనున్న తెలంగాణ రాష్ట్రంలో విజయం మాదేనంటూ ఆ పార్టీ దీమాగా చెప్పుకుంటోంది. మరోవైపు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అధిక స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు సమావేశమై కీలక అంశాల గురించి చర్చించారని తెలుస్తోంది. సాధారణంగా... ఎన్నికల తేదీల ప్రకటనకు కొద్దిరోజుల ముందు ఈ కమిటీ భేటీ కావడం సంప్రదాయం. అయితే కొద్దినెలల ముందే ఈ కమిటీ సమావేశం కావడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అసలే కర్ణాటకలో ఓటమితో దెబ్బతిన్న బీజేపీ ... త్వరలో జరుగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాజీ లేని పోరాటం చేయాలని భావిస్తోంది. మిజోరం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణలో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. వీటిలో ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌, తెలంగాణలో విపక్ష పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఈ మూడుచోట్ల అధికారం కోసం బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ సారి సార్వత్రిక ఎన్నికలు గతంలో జరిగినంత సులువుగా, అనుకూలంగా జరగవని...  ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’తో గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర బీజేపీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐదు రాష్ట్రాల్లో పార్టీ బలహీనంగా ఉన్న స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అంశంపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.  ఈ సందర్భంగా పలువురు స్పందిస్తూ అభ్యర్థులను ముందే ప్రకటించాలని, తద్వారా వారు ఎన్నికలకు సన్నద్ధం కావడానికి సరిపడినంత సమయం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, విపక్షాల ఎన్నికల హామీలను దీటుగా ఎదుర్కొనేందుకు బీజేపీ అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ... ఎన్నికలు సమీపించేకొద్దీ పొలిటికల్ సీన్ ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠగా మారింది. ఏం జరుగుతుందో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos