రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు... అలాగని ఏదీ అశాశ్వతమూ కాదు... ఏ పార్టీ, ఎప్పుడు... ఎవరితో కలిసి పనిచేస్తుందో ... ఎవ్వరితో విడిపోతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఇప్పుడు దేశ రాజకీయాల్లో వేడి పెరిగింది... వేగమూ పెరిగింది. అధికార ఎన్డీయే కూటమి, విపక్ష కూటమి 2024 ఎన్నికల యుద్ధానికి సిద్ధమయ్యాయి. అందులో భాగంగానే ఒకే రోజున.. 18వ తేదీ మంగళవారం రెండు కూటములు పోటాపోటీ సమావేశాలు నిర్వహించాయి.

బీజేపీ సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ అంటే ఎన్డీయే... తన పాత మిత్రులతో ఢిల్లీలో సమావేశమైంది. పాత మిత్రులంటే... అందరూ కాదు... కొందరు పాత మిత్రులు ఇప్పటికే బీజేపీకి దూరమై ఉండగా ... కొందరు కొత్త మిత్రులు వచ్చి చేరారు. కాగా... తెలుగు రాష్ట్రాల్లో పాత మిత్రుడైన టీడీపీని వదిలి ... బీజేపీ అధిష్టాన పెద్దలు కేవలం జనసేన పార్టీకి మాత్రమే కబురు పంపారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా సమాయత్తమవుతున్న క్రమంలో ... ఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశంలో మొత్తం 38 పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. గత తొమ్మిదేళ్లుగా మిత్రపక్షాలను పెద్దగా పట్టించుకోలేదని బీజేపీ విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్డీయే మిత్రుల సమావేశం జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అదే సమయంలో... చిరకాలంగా తమతో కొనసాగిన మిత్ర పక్షాలను బీజేపీ దూరం చేసుకుంది.

మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ శిరోమణి అకాలీదళ్ మూడేళ్ళ క్రితమే ఎన్డీయేకు గుడ్ బై చెప్పగా... మహారాష్ట్ర రాజకీయాల్లో ఎవరిది పైచేయి అన్న అంశంపై శివసేన ... బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. చంద్రబాబు టీడీపీ, నితీశ్ కుమార్ జేడీయూ, పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ ఇలా గతంలో ఎన్డీయేకు దగ్గరై ... ఇప్పుడు దూరం జరిగిన పార్టీలు చాలానే ఉన్నాయి.  మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక ఎన్డీఏ పక్షాలను పట్టించుకున్నదే లేదు. అందుకనే పలు పార్టీలు కూటమి నుంచి వెళ్లిపోయాయి. కానీ ఇప్పుడు ఆ కూటమి గుర్తొచ్చింది. దీంతోనే రెండో టర్మ్ ప్రధాని అయ్యాక తొలిసారిగా పెద్దఎత్తున సమావేశం ఏర్పాటు చేశారు. చిన్నదో పెద్దదో.. ఏదిఏమైనా జాతీయ పార్టీలు పెద్దన్నలుగా ఉన్న కూటమిలోకి ఓ పార్టీని పిలిచారంటే ఆ పార్టీకి ఎంతో కొంత ఉనికి ఉన్నట్లే. ఎన్సీపీ శరద్ పవార్ వర్గం అజిత్ పవార్ వర్గంగా శివసేన (ఉద్ధవ్) శివసేన (షిండే)గా చీలిపోయి ఎన్డీఏ, యూపీఏల్లో చెరోవైపున నిలిచాయి.

ఉత్తరాదిపార్టీగా పేరున్న బీజేపీ.. ఉత్తరాది రాష్ట్రాలలో ఇప్పటికే ఎక్కువ సీట్లను గెలుచుకుంది. అక్కడ ఇంకా సంఖ్యను పెంచుకునే అవకాశం తక్కువ ఉండటంతో, ఇప్పడు ... బీజేపీ అధిష్టానం... దక్షిణాదిన తమ ఎంపీ సీట్ల సంఖ్యను పెంచుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే... బీజేపీ తాజాగా అలయెన్స్ బలోపేతంపై దృష్టి సారించింది. కాగా... సమావేశంలో... బీజేపీ, ఎన్డీఏ నేతలు విపక్ష కూటమిపై విమర్శలు సంధించారు. విపక్ష కూటమి పేరు మార్చుకోగానే గుణం మారదు అంటూ కామెంట్స్ చేశారు. బీజేపీ నేతలు మాట్లాడుతూ... ఎన్డీఏ 1998లో ఏర్పాటైందని... 25 ఏళ్ల తర్వాత నేడు మరింత విస్తరించి బలోపేతమైందని అన్నారు. కానీ, యూపీఏ మాత్రం భాగస్వామ్యపక్షాలు మారనప్పటికీ పేరును రద్దు చేసుకొని తన ఉనికినే చంపు కున్నదని... పేరు మార్చుకున్నంత మాత్రాన గుణం మారదని విమర్శించారు. ఇకపై రాజకీయపోరు ... భరతమాత. విపక్ష కూటమి అయిన ఇండియా మధ్య ఉంటుందంటూ ఎన్డీఏ పక్ష నేతలు  పేర్కొన్నారు. ‘ఇండియా’ అనేది బ్రిటీషర్లు పెట్టిన పేరని, వలసవాదుల బానిసత్వం నుంచి కాంగ్రెస్ బయటపడాలన్నారు.

ఇదిలావుండగా... ప్రధాని మోదీ సారథ్యంపై ఎన్డీఏ కూటమి పక్షాలు ... సమావేశంలో పూర్తి విశ్వాసాన్ని ప్రకటించాయి. 2024 ఎన్నికలకూ ఆయన సారథ్యంలోనే వెళ్లాలని నిర్ణయించాయి. మంగళవారం ఎన్డీఏ పార్టీల భేటీ ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. కూటమి ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సమావేశం నిర్వహించినట్లు ఎన్డీయే ప్రకటించింది. వరుసగా మూడోసారి కూడా మోదీ సారథ్యలోనే లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలని ఎన్డీఏ మరోసారి కూటమిలోని పార్టీలన్నీ నిర్ణయించాయి. భారీ మెజారిటీతో మోదీ ప్రధాని అవుతారు అన్ని ఎన్డీయే తీర్మానంలో పేర్కొంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos