నేపాల్ ప్రధాని కేపీ ఓలి.. తన పదవికి రాజీనామా చేశారు. దేశ సైన్యం సూచన మేరకు ఆయన పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాపై నిషేధం, అవినీతి ఆరోపణలతో మొదలైన నిరసనలు నిన్నటి నుంచి మరింత హింసాత్మకంగా మారాయి. పార్లమెంట్ ముట్టడితో సైన్యం రంగంలోకి దిగి కాల్పులు జరపగా 20 మంది మరణించారు. వందలాది మందికి గాయాలయ్యాయి. దీంతో ప్రధాని కేపీ ఓలి ఇందుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు.

సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేయడంతో పాటు.. హోంమంత్రి రాజీనామా చేసినా ప్రజల నిరసనలు ఆగకపోవడంతో.. ప్రధాని రాజీనామా చేయడమే అనివార్యంగా మారినట్లు సమాచారం. కాగా.. పదవికి రాజీనామా చేసిన వెంటనే కేపీ ఓలిని ఆర్మీ రహస్య ప్రాంతానికి తరలించింది. సాయంత్రం నేపాల్ కొత్త ప్రధానిని ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రధాని రేసులో ఎవరెవరు ఉన్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

కాగా.. నేపాల్‌ పార్లమెంట్‌ ప్రాంగణంలో యువత చేస్తున్న రచ్చ..కుర్రాళ్ల ఆక్రోశాన్ని చూసి పోలీసులే ఎదురెళ్లడానికి వణికిపోయారు.. ఒక్కసారిగా వేలాది మంది రావడంతో చేతులెత్తారు. ఫలితంగా పార్లమెంటులోకి దూసుకెళ్లి మరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వాస్థిని ధ్వంసం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టాల్సిన పోలీసులే తమని తాము రక్షించుకోవడానికి చచ్చి బ్రతికారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. బారికేడ్లు పెట్టినా, బాష్పవాయువు ప్రయోగించినా, వాటర్‌ కెనాన్స్‌తో విరుచుకుపడ్డా ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. దారి పొడుగునా ఉన్నా వాహనాలను తగులబెట్టుకుంటూ పోయారు. ప్రజాప్రతినిధుల కార్లకు నిప్పంటించారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos