టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీలోనే కాకుండా... దేశవ్యాప్తంగాను, అంతర్జాతీయంగాను ఆందోళనలు జరుగుతున్న క్రమంలో... ఇటీవల ఐటీ ఉద్యోగులు తెలంగాణలోనూ నిరసనలు వ్యక్తం చేశారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం టీడీపీ ర్యాలీలపై ఆంక్షలు విధించింది. దీనిపై మంత్రి కేటీఆర్‌ను మీడియా ప్రశ్నించగా.. ఏపీ రాజకీయాలతో తెలంగాణ రాజకీయాలకు ఏం సంబంధం అని సమాధానం ఇచ్చారు. ఇక్కడ ర్యాలీలు ఎందుకని.. ఏపీలో చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. రాజమండ్రిలో భూమి బద్ధలయ్యేలా ర్యాలీలు చేసుకోవాలని.. ఇక్కడ ఎవరు ర్యాలీలు, నిరసనలు చేపట్టినా ఊరుకునేది లేదని.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించడంతో... ఇదికాస్త పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్‌కు సమాధానంగా సోషల్ మీడియాలో టీడీపీ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. టీడీపీ ఏపీలోనే కాదు.. తెలంగాణలో కూడా ఉందని పలువురు నెటిజన్‌లు కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 9 ఏళ్లు సీఎంగా చేశారని.. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారని కామెంట్లు పెడుతున్నారు. హైదరాబాద్ ఇంకా కామన్ క్యాపిటల్ అన్న సంగతి కేటీఆర్ మరిచిపోయారని... తెలంగాణను అభివృద్ధి చేసిన నేతల్లో చంద్రబాబు ముందుంటారని ... ఈ విషయాన్ని గతంలోనే బీఆర్ఎస్ పార్టీ నేతలు పలుమార్లు అసెంబ్లీలో కూడా ప్రస్తావించారని అంటున్నారు. ఇప్పుడు టీడీపీ కష్టకాలంలో ఉన్న సమయంలో మీకు కృతజ్ఞత లేకపోయినా ప్రజలకు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఇంకా మాట్లాడాలంటే.. ప్రస్తుతం కేసీఆర్ పార్టీలో టీడీపీకి చెందిన చాలామంది నేతలు ఉన్నారని.. 2019 ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు కూడా మీ పార్టీలో ఉన్నారని... కేటీఆర్‌కు ఈ విషయం గుర్తులేదా అని నిలదీస్తున్నారు. జాతీయపార్టీ పేరుతో ఏపీలో బీఆర్ఎస్ శాఖ ఓపెన్ చేసి సభలు పెట్టినప్పుడు.. టీడీపీ అభిమానులు ఇక్కడ శాంతియుతంగా ర్యాలీలు చేస్తే శాంతిభద్రతలకు విఘాతం ఎలా కలుగుతుందని ప్రశ్నిస్తున్నారు. శాంతియుతంగా ఎక్కడైనా నిరసనలు, ర్యాలీలు చేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించిందని.. ఈ విషయం కేటీఆర్ తెలుసుకుంటే మంచిదని టీడీపీ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. రాజకీయాలకతీతంగా ప్రజలు స్వచ్ఛందంగా చేస్తున్న నిరసనలను అడ్డుకోవడం అంటే, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమే నని విమర్శిస్తున్నారు. కాగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు తెలంగాణ రాజకీయాలను సైతం ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు అరెస్టుపై తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నా ఆ పార్టీలోని పలువురు నేతలు ఈ అంశంపై స్పందిస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos