మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ (MGNREGA) స్థానంలో వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ ఔర్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) (VB-G RAM G) బిల్లు, 2025'ను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. గ్రామీణాభివృద్ధిలో గత ప్రభుత్వాల కన్నా తాము ఎంతో ఎక్కువ చేశామని, గ్రామీణులకు పక్కా ఇళ్లు మొదలుకుని అనేక రకాల సౌకర్యాలను కల్పించామని పేర్కొన్నారు. ఉపాధి హామీ స్థానంలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం పట్ల ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లు టేబుల్ అయిన వెంటనే నిరసనలకు దిగారు.

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. మహాత్మా గాంధీ పేరును చరిత్ర పుటల్లో నుంచి చెరిపివేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సంవత్సరంలో 100 రోజుల పాటు గ్రామీణులకు ఖచ్చితంగా ఉపాధిని కల్పించడానికి ఉద్దేశించిన ఈ బిల్లును స్క్రాప్ చేయాలనుకోవడం అవివేకమని మండిపడ్డారు. ఈ నిరసనలకు కాంగ్రెస్ లోక్ సభ సభ్యురాలు కాంగ్రెస్ ప్రియాంక గాంధీ సారథ్యాన్ని వహించారు. ఉపాధి హామీ చట్టం రద్దు, మహాత్మా గాంధీ పేరు తొలగింపు పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. మరింత పరిశీలన కోసం ఈ బిల్లును పార్లమెంటరీ ప్యానెల్‌కు పంపాలని డిమాండ్ చేశారు. మహాత్ముడి ఫొటోలను ప్రతిపక్ష సభ్యులు సభలో ప్రదర్శించారు. జాతిపిత పేరు తొలగింపును వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగారు. గట్టిగా నినాదాలు చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది.

జాతిపిత పేరు మార్చడం పట్ల ప్రభుత్వం ఎందుకు అంత ఆసక్తి చూపుతోందని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో MGNREGA చట్టం ఏకగ్రీవంగా పార్లమెంట్ లో ఆమోదం పొందిందని గుర్తు చేశారు. అప్పట్లో ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టినప్పుడు ఏ ఒక్క పార్టీ కూడా వ్యతిరేకించలేదని, ఇది అందరి ఆమోదంతో చట్టంగా రూపాంతరం చెందిందని అన్నారు. ఉపాధిని 100 రోజుల నుండి 125 రోజులకు పెంచుతున్నామన్న ప్రభుత్వ వాదనలను ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. ఇప్పటివరకు 90 శాతం నిధుల చెల్లింపు బాధ్యత కేంద్రానిదేనని, తాజా ప్రతిపాదనల ప్రకారం.. ఈ ఆర్థిక భారాన్ని రాష్ట్రాలకు బదిలీ చేస్తోందని ప్రియాంక గాంధీ అన్నారు. పేద రాష్ట్రాలు ఈ మొత్తాన్ని భరించలేవని, చివరికి ఈ పథకం కుప్పకూలుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పథకం పేరు మార్పు ముసుగులో దీన్ని రద్దు చేయాలనుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, సహా పలువురు సీనియర్ నాయకులు నిరసనలకు దిగారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos