టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజాకు మంత్రి పదవి దక్కింది. 26 మందితో కూడిన కొంత మంత్రి వర్గాన్ని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ శుక్రవారం ప్రకటించారు. రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేకు తొలిసారి మంత్రి పదవి దక్కింది. గురువారం గుజరాత్ అసెంబ్లీలో సీఎం మినహా మంత్రులంతా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పాత క్యాబినేట్‌లో ఆరుగురు మాత్రమే తమ పదవులను నిలబెట్టుకున్నారు. హోమ్ మినిస్టర్ హర్ష్ సంఘవి డిప్యూటీ సీఎంగా నియమితులయ్యారు. కొత్త కాబినేట్‌లో 20 మందికి కొత్తగా అవకాశం దక్కింది. 2019 మార్చిలో బీజేపీలో చేరిన రివాబా జడేజా.. 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్‌నగర్ నార్త్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. తన ప్రత్యర్థి అయినా కాంగ్రెస్ అభ్యర్థి బిపేంద్రసిన్హ్ జడేజాపై 15వేల ఓట్ల మెజార్టీతో రివాబా జడేజా విజయం సాధించింది.ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. రివాబా జడేజాకు వ్యతిరేకంగా రవీంద్ర జడేజా సోదరి నైనబా జడేజా, తండ్రి అనిరుద్ద్ సిన్హ్ జడేజా ప్రచారం చేశారు. కానీ మామ, ఆడబిడ్డపై రివాబా జడేజానే పై చేయి సాదించింది. రవీంద్ర జడేజా కుటుంబం ఎన్నో తరాలుగా కాంగ్రెస్ పార్టీకి మద్ధతుదారులుగా ఉన్నారు. జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి జడేజా సోదరి నైనబా జడేజా టికెట్ ఆశించింది. కానీ ఆమెకు టికెట్ దక్కలేదు.
టీమిండియాకు దూరంగా ఉండి మరి జడేజా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. సతీమణి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇక 1990లో జన్మించిన రివాబా జడేజా.. మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. ఆమె తండ్రి వ్యాపారవేత్త కాగా.. కాంగ్రెస్‌కు చెందిన హరి సింగ్ సోలంకి మేనకోడలు. 2016లో రవీంద్ర జడేజాను పెళ్లి చేసుకున్న రివాబా జడేజా.. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఆమె ఆస్తుల విలువ రూ.97 కోట్లుగా పేర్కొన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos