నవరాత్రులు ప్రారంభం నుంచే కొత్త జీఎస్టీ విధానం పనిచేస్తుందని కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. విశాఖ వి.కన్వెన్షన్‌లో నిర్వహించిన నెక్స్ట్ జెన్ జీఎస్టీ 2.0 అవుట్ రీచ్ ప్రోగ్రామ్‌లో కేంద్రమంత్రి పాల్గొన్నారు. జీఎస్టీ 2.0 అమలులోకి రాక ముందే ఆటో మొబైల్ ఇండస్ట్రీ ఆఫర్లు ప్రకటించడం కనిపిస్తోందన్నారు. పాలు, పెరుగు సహా పలు నిత్యావసరాలను 5 శాతం శ్లాబ్‌ నుంచి సున్నా శాతానికి తీసుకొచ్చాం. మధ్యతరగతికి ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకున్నామని నిర్మలా వివరించారు.

2017-18 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ద్వారా రూ.7.19 లక్షల కోట్ల ఆదాయం రాగా.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.22.08 లక్షల కోట్ల ఆదాయం లభించిందని చెప్పారు. ప్రజలపై భారం తగ్గించేందుకే జీఎస్టీ తీసుకొచ్చామన్నారు. కారు, ఫ్రిజ్‌, ఏసీని 28 శాతం నుంచి 18 శాతానికి తీసుకొచ్చామని సీతారామన్‌ తెలిపారు. మహిళల ఆరోగ్యం కోసం శానిటరీ న్యాప్‌కిన్స్‌పై పన్నును సున్నా చేశాం. యూపీఏ ప్రభుత్వంలో 30 శాతం ఉన్న వస్తువులను ఇప్పుడు 5 శాతానికి తెచ్చాం. సరళతరమైన పన్ను విధానాన్ని తీసుకురాలేని వాళ్లు ఇప్పుడు విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు. గతంలో 65 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉండేవాళ్లు. ఈ 8 ఏళ్లలో ఆ సంఖ్య 1.51 కోట్లకు చేరిందని నిర్మలా సీతారామన్‌ వివరించారు.

వెన్న, నెయ్యి, వంటపాత్రలను 12 నుంచి 5 శాతానికి తెచ్చాం. పప్పులు, చింతపండు, ఉప్పును 12 నుంచి 5 శాతానికి ..హెయిర్‌ ఆయిల్‌, షాంపూను 18 నుంచి 5 శాతానికి తీసుకొచ్చామని,, మధ్యతరగతికి ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. కారు, ఫ్రిజ్ ఏసీని 28 నుంచి 18 శాతానికి తీసుకొచ్చామన్నారు. జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్‌కు పెద్ద ఊతం. ఐదు విభాగాలు చేసి ఏ స్లాబ్‌లో ఏ వస్తువులు ఉండాలో నిర్ణయించామని వెల్లడించారు. అనేక రంగాల్లో జీఎస్టీ ప్రయోజనాలు చేకూరాయని.. మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు చేశామన్నారు. పురుగు మందులు, డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలను దృష్టిలో పెట్టుకున్నామన్నారు. ఎంఎస్‌ఎంఈల దిగుమతులు, ఎగుమతులపై ఆలోచించామని నిర్మలా సీతారామన్‌ వివరించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos