దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఏప్రిల్ 1, 2026 నుంచి కీలక మార్పులు ఎదురుకానున్నాయి. కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రతిపాదించిన కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అధికారికంగా అమలులోకి రానుంది. సుమారు ఆరు దశాబ్దాల కాలం నాటి 1961 నాటి పాత చట్టం స్థానంలో, సరళీకృత నిబంధనలతో ఈ కొత్త వ్యవస్థను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఈ మార్పుల్లో అత్యంత ప్రధానమైనది ఐటీ రిటర్న్స్ (ITR) దాఖలు చేసే గడువు పొడిగింపు. వ్యాపారవేత్తలు, వృత్తి నిపుణులు (నాన్-ఆడిట్ కేసులు) తమ రిటర్న్లను దాఖలు చేయడానికి గతంలో ఉన్న జూలై 31 గడువును ఇప్పుడు ఆగస్టు 31 వరకు పొడిగించారు. అయితే, సాధారణ ఉద్యోగులకు (ITR-1, ITR-2) మాత్రం పాత గడువు జూలై 31గానే కొనసాగుతుంది. అదేవిధంగా, రివైజ్డ్ ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే విషయంలో కూడా వెసులుబాటు కల్పించారు. ఏవైనా పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దుకోవడానికి డిసెంబర్ 31 వరకు ఉన్న సమయాన్ని మార్చి 31 వరకు పెంచారు. అయితే డిసెంబర్ తర్వాత ఫైల్ చేసే వారు నిర్ణీత అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు, స్టాక్ మార్కెట్ ట్రేడర్లకు షాక్ ఇస్తూ ఎఫ్ అండ్ ఓ (F&O) లావాదేవీలపై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT)ను పెంచారు.

విదేశీ ప్రయాణాలు చేసే వారికి ప్రభుత్వం ఊరటనిచ్చింది. విదేశీ టూర్ ప్యాకేజీలపై ఇదివరకు ఉన్న 5%, 20% పన్ను (TCS) స్థానంలో ఇప్పుడు ఏకరీతిగా 2 శాతం పన్ను మాత్రమే వసూలు చేస్తారు. విదేశీ విద్య మరియు వైద్యం కోసం చేసే ఖర్చులపై కూడా టీసీఎస్ రేట్లను తగ్గించడం గమనార్హం. అలాగే రోడ్డు ప్రమాదాల్లో వచ్చే పరిహారంపై వడ్డీకి పన్ను మినహాయింపు కల్పించారు. మ్యూచువల్ ఫండ్స్ మరియు డివిడెండ్ ఆదాయాలపై గతంలో ఉన్న కొన్ని వడ్డీ మినహాయింపులను కొత్త చట్టం తొలగించింది. షేర్ల బైబ్యాక్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇకపై 'డివిడెండ్'గా కాకుండా 'కాపిటల్ గెయిన్స్'గా పరిగణించి పన్ను విధిస్తారు. ఈ మార్పులన్నీ పన్ను చెల్లింపు ప్రక్రియను మరింత పారదర్శకంగా, డిజిటల్ స్నేహపూర్వకగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ కొత్త చట్టంపై పన్ను చెల్లింపుదారులకు మరింత అవగాహన కల్పించేందుకు ఆదాయపు పన్ను శాఖ ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేయనుంది. పన్ను స్లాబుల్లో పెద్దగా మార్పులు లేకపోయినప్పటికీ, ప్రక్రియపరమైన ఈ మార్పులు సామాన్య పౌరులపై సానుకూల ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos