కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో చర్చ కొనసాగుతోంది. ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ చర్చలో పాల్గొంటూ... తమిళనాడు మాజీ సీఎం, దివంగత నాయకురాలు జయలలితను గుర్తు చేశారు. మణిపూర్ హింసకు సంబంధించి డీఎంకే ఎంపీ కణిమొళి చేసిన ద్రౌపదీ వస్త్రాపహరణం కామెంట్ పై నిర్మలా సీతారామన్ రియాక్ట్ అయ్యారు. ఆమె ఈ కామెంట్ ను ప్రస్తావిస్తూ... 1989లో తమిళనాడు అసెంబ్లీలో అధికార డీఎంకే సభ్యులు ... ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్న జయలలిత చీరను లాగి, ఆమెను అవమానించారని, అవహేళన చేశారని గుర్తు చేశారు. అలాంటి డీఎంకే పార్టీకి చెందిన కణిమొళి ... మా ప్రభుత్వం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇదే సందర్భంలో నిర్మలా సీతారామన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ... బీజేపీ ప్రభుత్వం ఆర్థిక రంగం సహా పలురంగాల్లో విజయాలు సాధించిందని వివరించారు. దేశంలో ఇప్పుడు ... చేస్తాం, చూస్తాం అనే రోజులు పోయాయని, మోదీ హయాంలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామని అన్నారు. 2014కి ముందు భారత్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉండేదని, ఇప్పుడు ఇదే భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని తేల్చి చెప్పారు. కొవిడ్ సంక్షోభం సవాలు ఎదురైనా అధిగమించి మరీ ... ఆర్థికంగా ముందుకెళ్లగలిగామని వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్‌దేనని తెలిపారు. ఇదిలావుండగా.. లోక్ సభలో అధికార పక్షానికి అనుకూలంగా ఉన్న పార్టీల ఎంపీలను పరిగణనలోకి తీసుకుంటే ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోవడం ఖాయమేననేది బహిరంగ రహస్యమే. ప్రస్తుత లోక్ సభలో ప్రభుత్వానికి అనుకూలంగా సుమారు 366 మంది ఎంపీలున్నారు. ఎన్డీయే పక్షాలే కాకుండా, వైసీపీ, బీజేడీ వంటి నాన్ ఎన్డీయే పార్టీలు కూడా ఈ విషయంలో ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నాయి. మరోవైపు, విపక్షం వైపు 147 మంది సభ్యులున్నారు. అందువల్ల, ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈరోజు అవిశ్వాసంపై చర్చ ముగుస్తున్న క్రమంలో... విపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి ప్రధాని మోదీ సమాధానమిచ్చేందుకు సిద్ధపడుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos