2025-26 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం ఆసన్నమవుతోంది. పెరిగిన ద్రవ్యోల్బణంతో సమాజంలోని ప్రతి వర్గంలోనూ.. రాబోయే బడ్జెట్‌పై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా, ధరల పెరుగుదలతో దారుణంగా దెబ్బతిన్న సామాన్యులకు ఉపశమనం కలిగించే ప్రకటనలు ఉండవచ్చు. ప్రజల చేతుల్లో నగదు చలామణీని పెంచేందుకు ప్రభుత్వ రాయితీ పథకాల iవిషయంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పూర్తి ఉదారంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వరకు చాలా సంక్షేమ పథకాల కోసం పెద్ద ప్రకటనలు ఉండవచ్చు.
స్థిరాస్తి రంగానికి బూస్టర్ డోస్ ఇవ్వడానికి మరియు సాధారణ ప్రజల సొంత ఇంటిని కలను నిజం చేయడానికి... కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో సబ్సిడీ మొత్తాన్ని పెంచవచ్చు. అంతేకాదు, ఈ పథకం కింద బ్యాంకుల నుంచి రుణం తీసుకునే ప్రక్రియను మరింత సరళంగా మార్చవచ్చు. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ప్రత్యేకించి, అర్బన్ హౌసింగ్ కోసం ఎక్కువ కేటాయింపులు ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి.
ఆయుష్మాన్ భారత్-ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద బడ్జెట్‌లో మరిన్ని కేటాయింపులు కూడా చేయవచ్చు. దీంతో, మరిన్ని కొత్త కుటుంబాలను ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలన్న ప్రచారానికి బలం చేకూరుతుంది. ఇటీవల 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న భారతీయులను ఈ పథకంలో చేర్చుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు, ఈ పథకానికి కేటాయింపులను పెంచడం వల్ల కవరేజీని పెంచడం మరింత సులువవుతుంది.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద, భారత ప్రభుత్వం వార్షిక నిధుల పంపిణీని రూ. 6,000 నుంచి రూ. 12,000కు రెట్టింపు చేయవచ్చు. ఇది, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి రైతులకు సాయం చేస్తుంది. వ్యవసాయ రంగంపై అధిక ధరల ప్రభావం తగ్గుతుంది. ఫలితంగా, రైతుకు పెట్టుబడి భారం తగ్గి లాభం పెరుగుతుంది. ప్రాథమిక రంగమైన వ్యవసాయం పచ్చగా ఉంటేనే మిగిలిన రంగాలు కళకళలాడతాయి. కాబట్టి, రైతుల చేతుల్లో డబ్బు పెరిగితే సమాజంలో నగదు ప్రవాహం పెరుగుతుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద పెట్టుబడి సాయాన్ని పెంచాలన్నది చాలా కాలంగా రైతుల డిమాండ్. రైతులకు అతి తక్కవ వడ్డీ రేట్లకు బ్యాంక్ రుణాలు మరియు తక్కువ పన్నులపైనా ఆర్థిక మంత్రి నుంచి ప్రకటనలు రావచ్చని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి ప్రకటనలు ఎలా ఉంటాయో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos