విపక్షాల ఐక్య కూటమి ప్రయత్నాల కోసం పాట్నాలో ఏర్పాటు చేసిన సమావేశం సక్సెస్ అయింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని విపక్షనేతలంతా నిర్ణయించినట్లు బీహార్ ముఖ్యమంత్రి, ఐక్య కూటమి ఏర్పాటుకు సంధానకర్తగా వ్యవహరిస్తున్న జేడీయూ నేత నితీష్ కుమార్ వెల్లడించారు. విపక్షాల సమావేశంలో ఖర్గే, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ఎంకే స్టాలిన్, హేమంత్ సోరెన్, అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ తదితర నేతలు పాల్గొన్నారు.

తదుపరి సమావేశం మల్లికార్జున్ ఖర్గే సారథ్యంలో సిమ్లాలో జులై 10వ తేదీ నుంచి మూడు రోజులపాటు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సిమ్లా సమావేశంలో 2024 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఆయా రాష్ట్రాల్లో కలిసికట్టుగా ఏవిధంగా పోరాడాలనే విషయంపై ఒక ఎజెండాను రూపొందించనున్నారు.

పార్టీల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ... సిద్ధాంతాలపై పరస్పరం చర్చించుకుని వాటిని పరిరక్షించుకునేందుకు కృషి చేయాలని ... ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోరాడితేనే దేశాన్ని రక్షించుకోవచ్చని ఆయా పార్టీల నేతలు విశ్వసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫాసిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించడమే తమ లక్ష్యమని వారందరూ ముక్తకంఠంతో చెప్పారు. మొత్తానికి పాట్నాలో నిర్వహించిన విపక్షాల సమావేశం సక్సెస్ కావడంతో... జులైలో జరిగే సిమ్లా సమావేశానికి ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos