బీజేపీకి బీహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ షాకిచ్చారు. ఏడాదిన్నరగా జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ లో బీజేపీ నేతృత్వంలోని బీరెన్‌ సింగ్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. ఆ రాష్ట్రంలో జేడీయూకి కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. మేఘాలయాలో అధికారంలో ఉన్న కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ సైతం కొన్ని నెలల క్రితమే మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. నేషనల్ పీపుల్స్ పార్టీ - NPP నిర్ణయం ప్రకటించిన నెలల వ్యవధిలోనే నితీశ్‌ కుమార్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

కాగా, మణిపూర్‌లో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ ఆరు స్థానాలను గెలుచుకుంది. ఆ తర్వాత కొన్ని నెలలకే  ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో ప్రస్తుతం అక్కడ జేడీయూకి కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే మిగిలారు. ఇక 60 మంది సభ్యులున్న మణిపూర్‌ అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 37 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఈ నేపథ్యంలో నితీశ్‌ పార్టీ నిర్ణయంతో బీరెన్‌ సింగ్‌ ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపదు. కానీ కేంద్రంలోని బీజేపీకి, బీహార్‌లో జేడీయూ కీలక మిత్రపక్షంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బీజేపీకి నితీశ్ కుమార్ మద్దతు ఎందుకు ఉపసంహరించుకున్నారనే విషయంపై స్పష్టత రావడంలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos