బీహార్‌లో జనతాదళ్ (యునైటెడ్)- భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్‌ కొద్దిసేపటి కిందటే ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయడం ఇది పదోసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యమంత్రి నితీశ్​తోపాటు 19 మంది మంత్రులు ప్రమాణం చేశారు. బీజేపీ నుంచి సీనియర్ నాయకుడు సామ్రాట్ చౌధరి, దిలీప్ జైశ్వాల్‌, మంగల్ పాండే, రామ్‌కృపాల్ యాదవ్‌, సంతోష్ సుమన్ తదితరులు మంత్రులుగా ప్రమాణం చేశారు. జేడీయూ నుంచి విజయ్ కుమార్ చౌధరి, బిజేంద్ర ప్రసాద్‌ యాదవ్‌, శ్రోవన్ కుమార్‌, లేసి సింగ్‌, సునీల్ కుమర్ల చేత గవర్నర్ అమాత్యులుగా ప్రమాణం చేయించారు. ఎల్జేపీ- రామ్‌విలాస్ పాసవాన్‌, రాష్ట్రీయ లోక్‌ మోర్చా, హిందూస్తాన్ అవామ్ మోర్చా నుంచి ముగ్గురు మంత్రులుగా ప్రమాణం చేశారు. జనవరిలో కేబినెట్ విస్తరణ ఉంటుందని ఎన్డీయే వర్గాలు తెలిపాయి. పాట్నా గాంధీ మైదాన్ లో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు కేబినెట్ సహచరులు హాజరయ్యారు. బీజేపీ, దాని మిత్రపక్షాల పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos