బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్‌లో గందరగోళం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై విపక్షాలు అవిశ్వాస తీర్మానానికి సిద్ధం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. స్పీకర్ తమ గొంతుకను నొక్కేస్తున్నారని, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. ఈ నోటీసుపై 118 మందికిపైగా ప్రతిపక్ష ఎంపీలు సంతకాలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 94-సీ ప్రకారం నోటీసు ఇచ్చినట్టు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ తెలిపారు.

కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), డీఎంకేతో సహా పలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన 120 మంది ఎంపీలు నోటీసుపై సంతకాలు చేశారని పేర్కొన్నారు. ప్రజాప్రయోజన అంశాలను విపక్షం లేవనెత్తకుండా స్పీకర్ పదేపదే అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. విపక్ష సభ్యులు మాట్లాడటానికి అనుమతించడం లేదని, అది వారి ప్రాథమిక హక్కని అన్నారు.. అలాగే, రాజ్యాంగ హక్కులను వినియోగించుకున్నందుకు 8 మంది విపక్ష సభ్యులను ఏకపక్షంగా సస్పెండ్ చేశారని గొగొయ్ ఆరోపించారు.

అయితే, స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంతకం చేయలేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో స్పీకర్ తొలగింపు పిటిషన్‌పై ప్రతిపక్ష నేత సంతకం చేయడం సరైంది కాదని తెలిపాయి. రాహుల్ గాంధీ సంతకం చేయకపోవడానికి అదే కారణమని వివరించాయి. కాగా, బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, 8 మంది సభ్యులను సెషన్ ముగిసే వరకూ సస్పెండ్ చేయడం, ప్రధానిపై దాడికి కాంగ్రెస్‌ మహిళా ఎంపీలు ప్రయత్నించారని నిరాధార ఆరోపణలు చేసి బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబేపై చర్యలు తీసుకోకపోవడం వంటి కారణాలతో అవిశ్వాస తీర్మానం అంశాన్ని విపక్షాలు తెర పైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

ఆర్టికల్ 94(c) ప్రకారం స్పీకర్‌ను తొలగించేందుకు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టొచ్చు. అయితే, ఇందుకు కనీసం 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, నోటీసుపై కనీసం 50 నుంచి 100 మంది ఎంపీల సంతకాలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం విపక్షం తమ నోటీసుపై 118 మంది ఎంపీలు సంతకం చేసినట్టు పేర్కొంది. దీంతో తీర్మానం తప్పకుండా ఆమోదించాల్సిన పరిస్థితి నెలకొంది. అదే జరిగితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుంది. కానీ, ప్రభుత్వానికి అవసరమైన సంఖ్యాబలం ఉన్నందున ఈ తీర్మానం వీగిపోయినప్పటికీ స్పీకర్ స్థానాన్ని వివాదాల్లోకి లాగడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos