దేశవ్యాప్తంగా టమోటా ధరలు ఆకాశాన్నంటి ... సామాన్య ప్రజలు విల్లావిల్లాడుతున్న క్రమంలో... వారు ఇప్పుడు ఉల్లి ఘాటును కూడా భరించేందుకు సిద్ధపడాలని మార్కెట్ పరిశీలకులు అంటున్నారు. టమోటా ధరలనే భరించలేకున్నాం మహాప్రభో  అని ప్రజలు లబోదిబోంటుండగా... టమోటాలకు తోడుగా మేమూ ఉన్నామంటూ ఉల్లి ధరలు కూడా త్వరలో ఆకాశంలో చుక్కల సరసన చేరనున్నాయి.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కిలో ఉల్లిపాయల ధర రూ. 25 నుంచి రూ. 32 వరకు పలుకుతోంది. ఈ రేటు రెట్టింపు లేదా అంతకుమించి పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయని మార్కెట్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ ధరలు కూడా ఎప్పుడో రెండు మూడు నెలల తరువాత పెరగడం కాదు... ఈ నెల చివరి నాటికే ... రిటైల్ మార్కెట్ లో పెరుగుతాయని అంటున్నారు. దీని ప్రకారం... సెప్టెంబరు ఆరంభం నాటికి కిలో ఉల్లిపాయలు రూ.60 నుంచి రూ.70 మధ్యలో పెరిగి... నెమ్మదిగా అంతకంతకు ధరలు పెరుగుతూ పోతాయని అంటున్నారు.

రబీలో ఉల్లిపాయ నిల్వ కాలం 2 నెలలు తగ్గింది. ఈ నిల్వలు ఈ నెలాఖరుకు తగ్గుముఖం పడతాయని, దీనివల్ల సెప్టెంబరులో సరఫరా తగ్గి ధరలు పెరుగుతాయని విశ్లేషిస్తున్నారు. సాధారణంగా... రబీ ఉల్లిపాయల స్టాక్‌ సెప్టెంబర్‌ చివరి వరకు మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది. ఓపెన్‌ మార్కెట్‌లో రబీ స్టాక్ బాగా తగ్గినందున... ఆగస్టు చివరి నాటికి గోడౌన్లు ఖాళీ అయ్యే పరిస్థితి వస్తుందని... దీనివల్ల నెమ్మదిగా రేట్లు పెరిగి, సెప్టెంబర్‌లో పీక్‌ స్టేజ్‌కు చేరతాయని అంటున్నారు.
అయితే ఇక్కడ చిన్నపాటి ఉపశమనం కూడా ఉందని మార్కెట్ పరిశీలకులు అంటున్నారు. 2020 సంవత్సరంలో లాగా... అప్పటి గరిష్ట స్థాయి అయిన రూ. 200 స్థాయికి మాత్రం ఉల్లి రేటు ఈసారి వెళ్లదని... అక్టోబరులో ఖరీఫ్ పంట లభ్యత పెరుగుతుందని, ఆ సమయంలో ధరలు తగ్గుముఖం పడతాయని కూడా వారు అంటున్నారు. పండుగ సీజన్లలో ధరలలో హెచ్చుతగ్గులు ఉంటాయని... ఖరీఫ్‌, రబీ రెండు సీజన్లలోనూ ఆనియన్‌ దిగుబడి తగ్గినా.. ఈ ఏడాది ఉల్లి సరఫరా మరీ తీసికట్టుగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఆగస్టు, సెప్టెంబరులో కురిసే వర్షాలను బట్టి ఉల్లి దిగుబడి ఆధారపడి ఉంటుందని వారు విశ్లేషిస్తున్నారు.
ఏదిఏమైనా... ఇప్పటివరకు  టమోటా తన తడాఖా చూపించగా... త్వరలో ఉల్లి ధరలు కూడా పెరుగుతుండడంతో సామాన్యుడు జేబుకి చిల్లు పడనుంది. ధరలు ఇదే విధంగా పెరిగితే రానున్న రోజుల్లో ఇతర కూరగాయాలు, తిండి గింజల ధరల పెరుగుదల కూడా తప్పదేమోనని వారు  కంగారు పడుతున్నారు. మున్ముందు ఏం జరుగుతుందో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos