సుదీర్ఘకాలంగా అసలు చర్చల స్థాయి కూడా దాటని మహిళారిజర్వేషన్ బిల్లుకు తాజాగా లోక్ సభలో ఆమోదం లభించిన తరువాత దేశవ్యాప్తంగా సర్వత్రా అన్నివర్గాల మహిళల్లోనూ ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. బిల్లుకు మద్దతుగా 454 మంది సభ్యులు ఓటు వేయగా... ఈ బిల్లును ఇద్దరుఎంపీలు మాత్రం వ్యతిరేకించారు. లోక్‌సభలో మొత్తం 545 మంది ఎంపీలకు గాను 456 మంది సభకు హాజరై ఓటు వేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన ఇద్దరు ఎంపీలు ఎవరో కాదు... హైదరాబాద్ కేంద్రంగా నడిచే ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కాగా... మరొకరు ఔరంగాబాద్ లోని ఛత్రపతి శంభాజీనగర్ ఎంపీ ఇంతియాజ్ జలీల్. సభలో చర్చలో భాగంగా వారు మాట్లాడుతూ... ఈ బిల్లు కేవలం అగ్రకుల మహిళల కోసమే ప్రవేశపెట్టిన బిల్లుగా అభివర్ణించారు. ఎంఐఎం ఈ బిల్లును వ్యతిరేకిస్తోందని అన్నారు. కాగా... చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లు ను లోక్‌సభలో నారీ శక్తి అధినియమ్ పేరుతో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రవేశపెట్టడం... సభ ఆమోదించడమూ చకచకా జరిగిపోయాయి. మొత్తం సభలోని సభ్యులందరిలో ఈ ఇద్దరు మాత్రమే వ్యతిరేకించినా.. బిల్లు ఆమోదానికి ఎలాంటి అడ్డంకి ఏర్పడకుండా ఈజీగా పాసై పోయింది. అయితే... మహిళా రిజర్వేషన్లు మాత్రం వచ్చే సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత నుంచే అమల్లోకి వస్తాయి.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos