పాకిస్తాన్ లోనూ, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లోనూ ఉగ్రవాద వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని భారత సాయుధ దళాలు నిన్న అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ సైనిక చర్య జరిపిన విషయం తెలిసిందే. మన దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నిన ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపారు. మొత్తం 9 ప్రదేశాలు లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పాకిస్తాన్ పై భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింథూర్ గురించి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ త్రివిధ దళాల అధిపతులతో మాట్లాడారు. ఆపరేషన్‌ వివరాలను, తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ సింథూర్ మెరుపు దాడుల నేపథ్యంలో సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరుపుతుండగా .. వీటిని భారత ఆర్మీ సమర్థంగా తిప్పికొడుతోంది.  ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన ఆపరేషన్ సింథూర్ నుప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా రాత్రంతా పర్యవేక్షించారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో వైమానిక దాడుల గురించి ప్రస్తావిస్తూ విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జై శంకర్ పాకిస్తాన్ కు భారత్ దీటైన జవాబు ఇచ్చిందని ఉగ్రవాదం పట్ల ప్రపంచం ఇకపైన ఎటువంటి సహనం చూపడానికి వీలులేదని అన్నారు.

ఇక మరోవైపు ఆపరేషన్ సింధూర్ పైన యావత్ భారతదేశం హర్షం వ్యక్తం చేస్తోంది. గతంలో సర్జికల్ స్త్రైక్స్ తో ఏ విధంగా అయితే భారత్ సత్తా చాటిందో, అదే తరహాలో నిన్న రాత్రి ఉగ్ర స్థావరాలను కూల్చివేసిన ఆపరేషన్ సింధూర్ తో భారత్ సాహసోపేత చర్య చేపట్టిందని అందరూ కొనియాడుతున్నారు. సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం ఇదని, దీనిద్వారా ప్రపంచానికి కూడా భారత్ సత్తా తెలిసిందని అంటున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోని ప్రజల నుండి, ప్రముఖుల నుండి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాదంపై భారత్ ఉక్కుపాదం మోపిందని అంటున్నారు. ప్రపంచ దేశాలకు ఉగ్రవాదాన్ని అణచివేయటంపై భారత్ తీసుకున్న సైనిక చర్య ద్వారా దిశా నిర్దేశం చేసిందని ప్రజలనుండి అభిప్రాయం వ్యక్తం అవుతోంది . దేశాన్ని విచ్చిన్నం చేయాలన్న ఉగ్రవాదులను మట్టు బెట్టడం ద్వారా, ప్రజలలో ఒక నమ్మకం ఏర్పడుతుందన్న భావన ఈ చర్య ద్వారా వ్యక్తమవుతోందని రాజకీయ నిపుణులు, సామాజిక వేత్తలు అంటున్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా మన దేశంలో పహల్గామ్ మృతుల కుటుంబాలకు న్యాయం జరిగిందని కూడా దేశం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోందని వారు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos