ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది. సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి.దీంతో బ్యాంకింగ్ వ్యవస్థ.. నగదు నిల్వల పైన కేంద్రం అప్రమత్తం అయింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని బ్యాంకులకు స్పష్టం చేసింది. బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్దేశించారు. వినియోగదారులకు, వ్యాపారాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది కలగకుండా చూడాలని స్పష్టం చేసారు.

సైబర్‌ భద్రత సన్నద్ధతపై ఆర్​బీఐ, బ్యాంకులు ఎన్‌పీసీఐ, బీమా సంస్థల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో నిర్మలా సీతారామన్‌ ఈ మేరకు కీలక సూచనలు చేశారు. సవాళ్లతో కూడిన సమయంలో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధరించడంలో బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగాల పాత్ర కీలకమని ఆమె పేర్కొన్నారు. ఇదే సమయంలో నగదు లావా దేవీలు.. విత్ డ్రాల పైన జరుగుతన్న ప్రచారాన్ని ఖండిస్తూ వినియోగదారులకు సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

బ్యాంకు కార్యాలయాలకు ఎలాంటి అంతరాయం కలగకూడదని చెప్పిన నిర్మలా ..డిజిటల్‌ విధానంలోనూ బ్యాంకింగ్‌ కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసారు. ఏటీఎంలలో సరిపడా నగదును అందుబాటులో ఉంచాలన్నారు. యూపీఐ సర్వీసులు సజావుగా సాగేలా జాగ్రత్త వహించాలని. ఆకస్మిక పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని నిర్దేశించారు. దేశ సరిహద్దు ప్రాంతాల్లోని శాఖల్లో విధులు నిర్వహిస్తున్న బ్యాంకు ఉద్యోగులు, వారి కుటుంబాల భద్రత కోసం చొరవ చూపాలని సూచించారు. ఈ విషయంలో భద్రతా ఏజెన్సీలతో కచ్చితంగా సమన్వయం చేసుకోవాలని మంత్రి నిర్మలా సీతారామన్‌ బ్యాంకుల ప్రతినిధులను ఆదేశించారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos