పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి హేయమైనదని.. ఆ దాడిలో 25 మంది భారతీయులు, ఓ నేపాల్ టూరిస్ట్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ అన్నారు. ముంబై దాడులు, పుల్వామా ఉగ్రదాడి తరువాత ఇది అత్యంత పెద్ద ఉగ్రదాడి అని, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత భూభాగంలోకి వచ్చి మరీ దాడులు చేసి  అమాయకుల ప్రాణాలు తీశారని అన్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన అపరేషన్ సిందూర్ వివరాలను ఆర్మీ అధికారులు, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ వెల్లడించారు.

విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మాట్లాడుతూ.. ‘కశ్మీర్‌లో అశాంతి, అల్లర్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రదాడి చేసింది. కశ్మీర్‌లో అభివృద్ధిని అడ్డుకోవడంతో పాటు ప్రజలను భయాందోళనకు గురిచేయాలని ఉగ్రవాదులు కుట్ర పన్నారు. పాకిస్తాన్ తమ నియంత్రణ రేఖను దాటి కాశ్మీర్ లో దాడులు జరుపుతోంది. పాకిస్తాన్ ప్రేరేపేత ఉగ్రవాదులకు భారత బలగాలు తమ సత్తా చాటాయి. పాకిస్తాన్ అంతర్జాతీయ సంస్థలను, పలు దేశాలను తప్పుదోవ పట్టించాలని చూస్తోంది. పాక్ ఉగ్రదాడులు సరిహద్దు దాటి వచ్చి దాడులు చేస్తున్నారు. దాంతో భారత్ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని, పహల్గాం ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు చర్చలు చేపట్టిందని అన్నారు.

ఉగ్రవాదులకు పాకిస్తాన్ స్వర్గదామమని, అందుకే పాక్ భూభాగం నుంచి జైషే మహ్మద్, లష్కరే టెర్రరిస్టులు భారత్ మీద ఉగ్రదాడులకు నిరంతరం ప్లాన్ చేస్తున్నారని’ విక్రమ్ మిస్త్రీ అన్నారు. టీఆర్ఎఫ్ ను నిషేధిత ఉగ్రసంస్థల జాబితా నుంచి తొలగించాలని పాకిస్తాన్ పలుమార్లు కోరింది. ఈ క్రమంలో అదే సంస్థ భారత్ మీద ఉగ్రదాడి చేసే స్థాయికి దాని కార్యకలాపాలు విస్తరించడం నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఈ క్రమంలోనే భారత్ ప్రతీకార చర్యలు చేపట్టి పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రస్థావరాలపై దాడి చేసి విధ్వంసం సృష్టించినట్లు తెలిపారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos