బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. థర్డ్ ఫ్రంట్ గా రంగంలోకి దిగింది అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM). మొత్తం 32 నియోజకవర్గాల్లో పోటీ చేయనుంది. ఆయా నియోజకవర్గాల జాబితాను కూడా విడుదల చేసింది. ఇందులో అయిదు చోట్ల పోటీ చేసే అభ్యర్థుల పేర్లు కూడా ఉన్నాయి. దశలవారీగా మిగిలిన అభ్యర్థుల పేర్లను విడుదల చేయనుంది. మొత్తం 16 జిల్లాల్లో 32 నియోజకవర్గాలతో కూడిన జాబితా ఇది. థర్డ్ ఫ్రంట్ గా ఎన్నికల బరిలో దిగడంతో ముస్లింల ఓటుబ్యాంక్ భారీగా చీలుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇది.. రాష్ట్రీయ జనతాదళ్- కాంగ్రెస్ మహాకూటమిని దెబ్బ కొట్టొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ జాబితాలో  ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉండే నియోజకవర్గాలు అధికంగా ఉన్నాయి. మెజారిటీ స్థానాల్లో మహాకూటమికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. వారి గెలుపు ఓటములను ఎంఐఎం తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిస్థితుల మధ్య ఎంఐఎం అధినేత, హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ సంచలన ప్రకటన చేశారు. బీహార్ రాజకీయాల్లో కొత్తగా థర్డ్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆజాద్ సమాజ్ పార్టీ, అప్నీ జనతా పార్టీతో కలిసి గ్రాండ్ డెమోక్రటిక్ అలయన్స్ పేరుతో ఎన్నికల బరిలోకి దిగినట్లు చెప్పారు. ఎన్డీఏ, ఇండియా బ్లాక్ కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు.

మహాకూటమిలోకి చేరడానికి ఎంఐఎంకు ఆహ్వానం లభించని విషయం తెలిసిందే. దీంతో ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్‌కు చెందిన 'ఆజాద్ సమాజ్ పార్టీ', స్వామి ప్రసాద్ మౌర్యకు చెందిన 'అప్నీ జనతా పార్టీ'తో జతకట్టారు. కిషన్‌గంజ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఐఎం బీహార్ అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్ మాట్లాడుతూ ... కూటమి సీట్ల పంపకాలపై స్పష్టత ఇచ్చారు. ఎంఐఎం- 35, ఆజాద్ సమాజ్ పార్టీ- 25, అప్నీ జనతా పార్టీ- నాలుగు స్థానాల్లో పోటీ చేస్తాయని తెలిపారు. మున్ముందు మరిన్ని సీట్ల సర్దుబాటు జరిగే అవకాశం ఉందని, అఖ్తరుల్ ఇమాన్ తెలిపారు. హంగ్ అసెంబ్లీ  ఏర్పడితే ఏ కూటమికి కూడా మద్దతు ఇవ్వకూడదని ప్రాథమికంగా నిర్ణయించామని వివరించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos