భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతలు చల్లబడ్డాయి. కానీ మూడు, నాలుగు రోజుల వ్యవధిలో పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన డ్రోన్లు, క్షిపణుల గురించి సంచలన విషయాలు వెలుగు చూశాయి. భారతదేశం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన తర్వాత పాకిస్తాన్ దాడులు చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఉపయోగించిన వాటిలో చైనా తయారీ PL 15 క్షిపణులు కూడా ఉన్నాయి. వాటిని భారత వైమానిక రక్షణ వ్యవస్థ కూల్చి వేసినట్లు భారత వైమానిక దళం ఇవాళ ప్రకటించింది. భారతదేశ వైమానిక రక్షణ వ్యవస్థ బలంగా ఉందని , పాకిస్తాన్ ఆ వ్యవస్థ జోలికి రాలేకపోయిందని, మా పోరాటం ఉగ్రవాదులు , వారి మద్దతుగా ఉన్న వ్యవస్థలపైనేనని ఎయిర్ ఆపరేషన్స్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. తాము పాకిస్తాన్ సైన్యంతో యుద్ధం చేయలేదని,. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడి చేశామని.. కానీ పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదుల తరపున పోరాడటం దురదృష్టకరమని వారు అన్నారు.
పాకిస్తాన్ వివిధ రకాల డ్రోన్లను వినియోగించిందని... దేశీయంగా తయారు చేసిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో మనం వాటిని అడ్డుకున్నామని, ఆకాశ్ డిఫెన్స్ వ్యవస్థతో శత్రువులను దీటుగా ఎదుర్కొన్నామని వారు తెలిపారు. పాక్ ప్రయోగించిన మిస్సైళ్లను ఆకాశ్ క్షిపణులతో నిర్వీర్యం చేశామని తెలిపారు. పాక్ లోని నూర్‌ఖాన్ ఎయిర్ బేస్‌పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసిందని, నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్ రన్ వే కు తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. దాడుల్లో భారత్ పూర్తిగా సంయమనం పాటించిందని.. సామాన్య ప్రజలపై ఎలాంటి దాడులు చేయలేదన్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం అమాయక పౌరులను టార్గెట్ చేసిందని సైనికాధికారులు తెలిపారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos