కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ... లోక్ సభ ముందస్తు ఎన్నికలకు ప్లాన్ చేస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఎంతవరకూ నిజమో కాదో కానీ... ఆ పార్టీ నాయకత్వం వేస్తున్న అడుగులను బట్టి చూస్తే... ఇది నిజమేనేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఏడాది ఆఖరులో అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అదే సమయంలో మహారాష్ట్ర అసెంబ్లీకి కూడా ముందస్తు ఎన్నికలను నిర్వహించాలని అక్కడి బీజేపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం చేరికతో ఇక తమకు తిరుగే ఉండబోదని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఈ ధీమాతోనే ఇదే డిసెంబర్‌లో ఈ అయిదు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర అసెంబ్లీకీ ఎన్నికలను నిర్వహించాలనే ప్రతిపాదనలపై కసరత్తు చేస్తోంది.

మరోవైపు తెలంగాణ సహా ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ కసరత్తు మొదలు పెట్టనుంది. ఇప్పుడు లోక్‌సభకు కూడా ముందస్తు ఎన్నికలను నిర్వహించే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. లోక్‌సభను రద్దు చేసి, ఈ ఏడాది డిసెంబర్‌లోనే ఎన్నికలకు వెళ్లాలనే ప్రతిపాదనలపై బీజేపీ కసరత్తు మొదలు పెట్టినట్లు చెబుతున్నారు. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఎలాగూ నిర్వహించాల్సి ఉంది. మహారాష్ట్రను కూడా కలుపుకొంటే ఈ సంఖ్య ఆరుకు చేరుతుంది. ఈ ఆరింటితో పాటు లోక్‌సభకు కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుందనే దిశగా బీజేపీ అధిష్ఠానం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే టైమ్స్ నౌ సర్వే లో బీజేపీకి అనుకూల ఫలితాలు వస్తాయని తేలడంతో ... ఆ ఊపులో ఉన్న బీజేపీ ముందస్తు ఎన్నికలకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే... రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు... ఇతర రాష్ట్రాల్లోనూ బీజేపీ సంస్థాగతంగా కీలక మార్పులు చేసిందని.. ముందస్తు ఎన్నికలకు సిద్ధపడేందుకే ఈ దిశగా చర్యలు తీసుకుందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఏం జరుగుతుందో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos