పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 30వ తేదీన అంటే రేపు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ జరగనుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే పలు బిల్లులు, ప్రభుత్వ బిజినెస్‌పై అఖిలపక్షానికి కేంద్రం తరఫున రాజనాథ్ సింగ్ వివరించనున్నారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరనున్నారు.
తొలిరోజు శుక్రవారం 31వ తేదీన పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. పార్లమెంట్ సమావేశాలు రెండు విడతల్లో జరగనున్నాయి. తొలి విడత సమావేశాలు 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరుగుతాయి. రెండో విడత సమావేశాలు మార్చి 10న మొదలై.. ఏప్రిల్ 4 వరకు జరుగుతాయి. ఈ మేరకు పార్లమెంటరీ బులిటెన్ విడుదలైంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న లోక్‌సభలో కేంద్ర బడ్జెట్-2025ను ప్రవేశపెడతారు. అదేరోజు ఎకనామిక్ సర్వేను ప్రవేశపెడతారు. అంతకుముందు రోజు రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్ధేశించి ప్రసంగిస్తారు.
గత పార్లమెంట్ సమావేశాలో రెండు సెషన్లలోనూ గందరగోళం నెలకొంది. దాంతో పార్లమెంట్ ప్రతిష్ట దెబ్బతిందని, ఈ సమావేశాల్లోనైనా ప్రతిపక్ష నాయకులు, ఇతర ఎంపీలు చర్చల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షం సహకరిస్తేనే పార్లమెంట్ పనిచేయడంతోపాటు చర్చలు జరుగుతాయన్నారు. ఈసారి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సమతుల్య బడ్జెట్‌ను ప్రవేశపెడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టడం వరుసగా ఇది 8వసారి కావడం గమనార్హం. ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో ఎన్డీయే సర్కారు మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ ఇదేననే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారులు గుర్తు చేస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos