ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దింపడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా బీజేపీయేతర ముఖ్యమంత్రులు ప్రతిపక్ష పార్టీల అధినేతలు.. పాట్నా వేదికగా నిర్వహించిన విపక్షాల కూటమి సదస్సు సూపర్ సక్సెస్ అయింది. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఐక్య కూటమి ఏర్పాటుకు సంధానకర్తగా వ్యవహరిస్తూ... సదస్సుకు హాజరైన నేతలందరినీ సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. ఈ విపక్షాల సదస్సులో మల్లికార్జునఖర్గే, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ఎంకే స్టాలిన్, హేమంత్ సోరెన్, అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్, ఒమర్ అబ్దుల్లా మెహబూబా ముఫ్తీ తదితర నేతలు పాల్గొన్నారు.
తదుపరి సమావేశం మల్లికార్జున్ ఖర్గే సారథ్యంలో సిమ్లాలో జులై 10-12 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ సదస్సు సక్సెస్ కావడంతో... ఇక సిమ్లా సదస్సు ఎలాంటి ప్రోగ్రెసివ్ తీర్మానాలతో ముందుకెళ్లాలనే యోచనలో నేతలందరూ ఇప్పటినుంచే నిమగ్నమయ్యారు. కేంద్రంలో బీజేపీని గద్దె దించడమనే సింగిల్ అజెండా విషయంలో ఐక్య కూటమిలో ఎవ్వరికీ.. ఎలాంటి అభ్యంతరాలు లేకున్నా... పార్టీల పరంగా కొన్ని విభేదాలైతే ఉన్నాయని... నెమ్మదిగా వాటన్నింటిని అధిగమించే ప్రయత్నాలు చేస్తామని ఆయా పార్టీల నేతలు అంటున్నారు.
దేశ పునాదులపై బీజేపీ దాడి చేస్తోందని... ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోరాడితేనే దేశాన్ని రక్షించుకోవచ్చనే ఏకాభిప్రాయానికి విపక్షాలన్నీ రావడం ద్వారా ఐక్యతకు ముందడుగు వేసినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఫాసిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించడమే లక్ష్యంగా సాగుతామని వారందరూ ఎలుగెత్తి చాటారు.
కాగా.. ఈ సందర్భంగా... కేజ్రీవాల్ తన డిమాండ్ ను బయటపెట్టారు. ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ తన వైఖరిని బయటపెట్టేంత వరకు భవిష్యత్తులో జరగబోయే ప్రతిపక్షాల సమావేశాలకు ఆప్ హాజరు కాబోదని ఆ పార్టీ తెగేసి చెప్పడం కాస్త ... ఈ కూటమికి ఇబ్బందికర పరిణామమే. అయితే... కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. వచ్చే నెలలో సిమ్లాలో జరగబోయే తదుపరి సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో కేజ్రీవాల్ ... ఓకే అని చెప్పి కామ్ అయిపోయారు.
మొత్తమ్మీద పాట్నాలో విపక్షాల కూటమి సక్సెస్ కావడం... మళ్లీ త్వరలోనే అంటే జులై రెండోవారంలోనే సిమ్లాలో రెండో సదస్సుకు రెడీ కానుండటంతో... బీజేపీ నాయకత్వం ఆలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. పాట్నా సదస్సుపై అమిత్ షా స్పందిస్తూ... అదొక ఫొటోసెషన్ అని కామెంట్ చేశారంటే... బీజేపీ అగ్రనేతల్లో సంథింగ్ ... ఫియర్ స్టార్ట్ అయినట్లుగా భావించవచ్చని విశ్లేషకులు అంటున్నారు. సదస్సుల వరకే కాకుండా రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హిట్ కొడితే... అప్పుడు ఈ ప్రయత్నాలకు సార్థకత ఉంటుందని వారు అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలిమరి.
యూట్యూబ్ లైవ్
LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam