జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో రోడ్డెక్కి ... ఆవేశంతో కూడిన ప్రసంగాలు చేయడం ద్వారా ... ప్రజలను చైతన్యపరచడం అటుంచి... సొంత సామాజిక వర్గమైన కాపు నేతల్లోనే ... గతంలో ఎప్పుడూ లేని విధంగా అలజడి మొదలైంది. వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ ... కాకినాడ చేరుకున్నప్పుడు అక్కడి ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖరరెడ్డిని విమర్శిస్తూ... ఆయన తండ్రిని సైతం వదలకుండా అనేక ఆరోపణలు చేశారు. పవన్ ప్రసంగం అంతటితో ఆగితే ఏ గొడవా ఉండేది కాదు.

అదే సమయంలో పవన్ పరోక్షంగా  కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపైన నోటికొచ్చింది మాట్లాడారు. పవన్ మాటలకు స్పందించిన ముద్రగడ పద్మనాభం... పవన్ ను ఘాటుగా విమర్శిస్తూ... అండీ అండీ అంటూనే లేఖాస్త్రాన్ని సంధించారు. అసలే ఐక్యత అంతంతమాత్రంగా ఉన్న కాపుల్లో ముద్రగడ లేఖ ఆ వర్గంలో కాక రేపుతున్న తరుణంలో నేను సైతం అంటూ... పవన్ మద్దతుదారుడు, మరో కాపు నేత చేగొండి హరిరామజోగయ్య కూడా సీన్ లోకి ఎంటర్ అయ్యారు.

ముద్రగడ మీద ఆరోపణలు చేస్తూ ... జోగయ్య సైతం లేఖ విడుదల చేశారు. దీనివల్ల ఏమైందంటే గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఒకవైపు ముద్రగడ ... మరోవైపు పవన్ మోహరించారు. వీరి వల్ల మిగిలిన కాపు నేతలకు సమస్యలు మొదలయ్యాయి. ముద్రగడకు మద్దతుగా నిలవాలా? లేకపోతే పవన్ వెంట ఉండాలా? అన్నది పెద్ద సమస్యగా మారింది. ముద్రగడకు రాజకీయాల్లో మిస్టర్ క్టీన్ గా మంచిపేరే ఉన్నప్పటికీ ... ఎవ్వరితోనూ అంత సులువుగా కలవరనే విమర్శ కూడా ఉంది.

మరోవైపు పవన్ కు మద్దతు ఇస్తూ... ఆయన కోసం ఎంతో తాపత్రయపడుతున్న జోగయ్యకు గతంలోలాగా ఇప్పుడు పెద్ద ఇమేజి లేదని అంటున్నారు. పవన్ వ్యాఖ్యలు.. ముద్రగడ లేఖ రాసిన పరిణామాల క్రమంలో... ముద్రగడ, పవన్ .. ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో... కాపులు రెండు వర్గాలుగా విడిపోయారు. ముద్రగడ పొలిటికల్ రీ ఎంట్రీలో భాగంగానే పవన్ కు వ్యతిరేకంగా లేఖ రాశారని... అది వైసీపీకి నచ్చే ప్రక్రియ కాబట్టి... ఆటోమేటిక్ గా ఆయన ఆ పార్టీలోకి ఎంట్రీ ఇస్తారేమోననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ముద్రగడ-పవన్‌ల రూపంలో కాపు నేతల మధ్య చీలిక వచ్చినట్లయింది. వీరిద్దరిలో ఎవరికి మద్దతుగా నిలబడాలో నిర్ణయించుకోవాల్సిన అనివార్యత కాపుల్లో ఏర్పడబోతోంది. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

 

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos