ఉత్తరాదిని భూకంపాలు వణికిస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 5.35 గంటల సమయంలో ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, గాజియాబాద్ ప్రాంతాల్లో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూమి కొన్ని సెకన్ల పాటు కంపించడంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని వార్తలు వచ్చాయి. ఈ భూకంప కేంద్రం ఢిల్లీకి సమీపంలోని భూమిలో 5 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిసింది. భూకంప సమయంలో పెద్ద శబ్ధాలు వినిపించాయని.. అపార్టుమెంట్లు, స్తంభాలు ఊగిపోయాయని తెలుస్తోంది.
ఢిల్లీలో భూకంపం వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే బీహార్ రాష్ట్రంలోనూ భూకంపం సంభవించింది. బీహార్ లోని సివాన్ జిల్లాలో భూప్రకంపనలు వచ్చాయి. భూకంపం కారణంగా సివాన్ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సివాన్ లో ఉదయం 8.02 గంటలకు ఈ భూప్రకంపనలు రాగా.. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 4.0గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. సివాన్ లో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది.
భూకంపం వచ్చిన సమయంలో భూమి చాలా తీవ్రంగా కంపించినట్లు వార్తలు వచ్చాయి. భూప్రకంపనల నేపథ్యంలో ప్రజలు తమ కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసి, బయటకు పరుగులు తీశారు. భూకంపం మళ్లీ వచ్చే ప్రమాదం ఉందనే భయంతో చాలా మంది ప్రజలు చాలాసేపు ఇళ్ల బయటే గడిపారు. కాగా ఢిల్లీలో భూకంపం సంభవించిన అనంతరం ప్రధాని మోదీ స్పందించారు. ఢిల్లీలో మళ్లీ భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలని, భద్రతా జాగ్రత్తలు పాటించాలని ప్రధాని కోరారు. అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos