టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ మరోసారి డ్రగ్స్ కేసులో చిక్కుకున్నారు. మాదాపూర్ డ్రగ్స్ వ్యవహారంలో ఆయన పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. విఠల్‌నగర్‌లో ఉన్న ఫ్రెష్‌ లివింగ్‌ అపార్ట్‌మెంట్‌లో దొరికిన డ్రగ్స్ కు సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి నవదీప్ స్నేహితుడు రాంచంద్ ను నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన నుంచి కీలక విషయాలు సేకరించిన పోలీసులు.... నవదీప్ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు అంచనాకు వచ్చారు. ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆయనకు నోటీసులు జారీ చేయనున్నారు. అయితే, ఇప్పటికే నవదీప్ తో పాటు ఆయన కుటుంబం పరారీలో ఉన్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.
మరోవైపు ... డ్రగ్స్ కేసు వ్యవహారానికి సంబంధించి నవదీప్ తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మీరు చెప్తున్న నవదీప్ నేను కాదని.. నేను జెంటిల్మెన్ అని... నేను ఇక్కడే ఉన్నానని.. దయచేసి క్లారిటీ తెచ్చుకోండి. థాంక్స్" అంటూ ట్వీట్ చేశారు. మీడియాతోనూ మాట్లాడానని ఆయన చెబుతున్నారు. తాను ఎక్కడికి పారిపోలేదని... హైదరాబాదులోనే ఉన్నానని...  డ్రగ్స్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నాడు. తాను కూడా సీపీ నిర్వహించిన ప్రెస్ మీట్ చూశానని, కమిషనర్ ... హీరో నవదీప్ అని ఎక్కడా మెన్షన్ చేయలేదని ... అతను వేరే నవదీప్ అయి ఉంటాడని చెబుతున్నాడు. కాగా ఇదే కేసులో మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్‌ను అరెస్ట్ చేశామని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కూడా నవదీప్ పేరు ఉంది. అప్పట్లో ఎక్సైజ్ పోలీసుల విచారణతో పాటు ఈడీ విచారణకు కూడా ఆయన హాజరయ్యాడు.

ఇదిలావుండగా... అటు మాదాపూర్ డ్రగ్స్ కేసులో  సినీ ఫైనాన్షియర్‌ కె.వెంకటరమణారెడ్డితో పాటు ‘డియర్‌ మేఘ’ దర్శకుడు సుశాంత్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి రూ.10 లక్షల విలువైన డ్రగ్స్‌ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో డీలర్‌ బాలాజీ నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేస్తున్న వారిలో పలువురు సినీ పరిశ్రమకు చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. హీరో నవదీప్, ‘షాడో’, ‘రైడ్‌’ చిత్రాల నిర్మాత రవి ఉప్పలపాటి, మోడల్‌ శ్వేత, మాజీ ఎంపీ దేవరకొండ విఠల్‌రావ్‌ కుమారుడు సురేష్ రావు, ఇంద్రతేజ్, కార్తీక్‌తోపాటు కలహర్‌ రెడ్డి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos