దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 1.56 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఉత్కంఠభరితమైన పోటీ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరి భవితవ్యాన్ని నిర్ణయించేందుకు 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 13,766 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. హోమ్ ఓటింగ్ విధానం ద్వారా అర్హత పొందిన 7,553 మంది ఓటర్లలో 6,980 మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 8న జరగనుంది. 25 ఏళ్లుగా ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ, రాజధానిని తిరిగి కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో తీవ్రంగా ప్రచారం చేసింది. మరోవైపు, గత రెండు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన కాంగ్రెస్ పునరుజ్జీవమే లక్ష్యంగా  పోటీకి దిగింది. న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ (ఆప్), పర్వేశ్ వర్మ (భాజపా), సందీప్ దీక్షిత్ (కాంగ్రెస్) వంటి ప్రముఖ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో బరిలో ఉన్నారు. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos