భారత ప్రజాస్వామ్యంలో ఒక కీలక ఘట్టం ప్రారంభమైంది. దేశ 15వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ పార్లమెంట్ హౌస్‌లోని 63వ నంబర్ గదిలో ఉదయం 10 గంటలకు ప్రారంభం అయింది. ఈ ఎన్నికలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలి ఓటు వేసి వేశారు. పార్లమెంట్ సభ్యులందరూ బ్యాలెట్ పత్రాలను ఉపయోగించి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్, ప్రతిపక్షాల సంయుక్త అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది.

ప్రధాని మోదీ ఓటు వేసిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సహా పలువురు కేంద్ర మంత్రులు, అధికార పార్టీ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు ప్రతిపక్ష కూటమి నాయకులు కూడా తమ ఓట్లను వేయడానికి క్యూలో నిలబడ్డారు. ఈ ఎన్నికలలో గెలుపొందే అభ్యర్థి రాజ్యసభకు ఎక్స్-అఫీషియో చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఇది ఆయన బాధ్యతలో ఒక ముఖ్యమైన భాగం. ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ చాలా పారదర్శకంగా, కట్టుదిట్టమైన భద్రత మధ్య జరుగుతుంది. ప్రతి ఓటరు గుర్తింపు ధ్రువీకరణ తర్వాతే ఓటు వేయడానికి అనుమతిస్తారు. పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. అనంతరం అంటే సాయంత్రం 6 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. ఎన్నికల ఫలితాలు ఈరోజు సాయంత్రం లేదా రాత్రి వెలువడే అవకాశం ఉంది.

ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు, వారి పార్టీల బలం చూస్తే.. అధికార ఎన్‌డీఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉంది. పార్లమెంట్‌లోని మొత్తం ఓటర్ల సంఖ్యలో ఎన్‌డీఏకు గణనీయమైన సంఖ్యలో ఎంపీలు ఉన్నారు. ఈ సంఖ్యాబలం ఆధారంగా ఎన్‌డీఏ అభ్యర్థి సునాయాసంగా గెలుపొందుతారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే ప్రతిపక్షాల తరఫున బరిలో ఉన్న తెలుగు అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి క్లీన్ ఇమేజ్ ఉండటం కలిసి వచ్చే అంశం. తాను పార్టీలకు అతీతమని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు బరిలో ఉన్నానని ఆయన ప్రకటించారు. మొత్తానికి ఉపరాష్ట్రపతి పదవికి జరుగుతున్న ఈ ఎన్నిక ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos