ప్రధాని మోదీ ... ఏపీ సీఎం చంద్రబాబును ఇవాళ మరోసారి ప్రశంసించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఇప్పటికే కొన్నిసార్లు పరస్పరం ప్రశంసలు కురిపించుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి చంద్రబాబును పీఎం మోడీ ప్రశంసించారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ భేటీ ఇందుకు వేదికైంది. ఇందులో చంద్రబాబు చేసిన ప్రజెంటేషన్ ప్రధాని మోదీని మంత్ర ముగ్ధుడిని చేసింది. దీంతో ఆయన ఈ భేటీకి హాజరైన ఇతర రాష్ట్రాలను ఉద్దేశించి చంద్రబాబును ఆదర్శంగా తీసుకోవాలంటూ సూచించారు.
ఇవాళ ఢిల్లీలో ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగిన నీతి ఆయోగ్ భేటీకి ఏపీ సీఎం హోదాలో చంద్రబాబు హాజరు కాగా.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర అధికారులు హాజరయ్యారు. ఇందులో వికసిత్ భారత్ కు సంబంధించి రాష్ట్రాలు తమ సూచనలు, సలహాలను పంచుకున్నారు. ఇదే క్రమంలో సీఎం చంద్రబాబు కూడా తన వంతుగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీలో తాను అమలు చేస్తున్న పీ4 కార్యక్రమంతో పాటు ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి అంశాలను కూడా చంద్రబాబు వివరించారు. అలాగే రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వ సహకారం కోరారు. ఈ భేటీలో వికసిత్ భారత్ సాకారంలో భాగంగా ఏపీకి సహకరించాలని ప్రధాని మోదీకి చంద్రబాబు విన్నవించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశాఖను అభివృద్ధి చేస్తున్నామని, ఇందులో భాగంగా నాలుగు జోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇదే మోడల్ ను అమరావతి, కర్నూలు, తిరుపతికి కూడా విస్తరించేలా కేంద్రం సాయం చేయాలన్నారు. డిజిటల్ పాలనను అమలు చేస్తున్నామని, ఇందులో భాగంగా ప్రతీ కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ పాస్ బుక్ కూడా ఇస్తామన్నారు.
చంద్రబాబు ప్రజెంటేషన్ ను పూర్తిగా విన్న ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. వికసిత్ భారత్ కోసం చంద్రబాబు ఇచ్చిన సూచనల్ని ప్రధాని ప్రశంసించారు. చంద్రబాబు ఇచ్చిన సూచనల్ని ఇతర రాష్ట్రాలు కూడా పరిశీలించాలని సూచించారు. చంద్రబాబు సూచనలు వికసిత్ భారత్ కు ఉపయోగపడేలా ఉన్నాయని కితాబిచ్చారు. ప్రధాని మోదీతో పాటు ఈ భేటీకి హాజరైన ఇతర వక్తలు కూడా చంద్రబాబు సూచనలను స్వాగతించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos