తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి పతాకస్థాయికి చేరుకుంటోంది. అక్టోబర్ 10వ తేదీ లోపే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది. 7 లేదా 8వ తేదీల్లో షెడ్యూల్ విడుదల అవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. సరిగ్గా నెల రోజుల తరువాత పోలింగ్ ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో... అన్నిపార్టీల నేతలు, అధినేతలు తెలంగాణ బాట పడుతున్నారు. ప్రచారధాటిని వేగవంతం చేసేందుకు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు.  ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తెలంగాణలో పర్యటించనున్నారు. అక్టోబర్ 1వ తేదీన పర్యటిస్తున్నట్లుగా ఆయన టూర్ ఖరారైంది. ఈ సందర్భంగా పార్టీ నిర్వహించే సభల్లో పాల్గొనటంతో పాటు… రూ.13,500 కోట్ల కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం ఇస్తారు. అక్టోబర్ 1న మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న మోదీ.. నగరంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో మహబూబ్ నగర్ జిల్లాలోని భూత్పూర్ వెళ్లి అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 5గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి ఢిల్లీకి తిరుగుపయనమవుతారు. మళ్లీ అక్టోబర్ 3న నిజామాబాద్‌లో రాష్ట్ర బీజేపీ నాయకత్వం నిర్వహించనున్న బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. ఈ సభలో పసుపు బోర్డును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. భారత్‌మాలలో భాగంగా నాగ్‌పూర్ నుంచి విజయవాడ వరకు నిర్మించ తలపెట్టిన ఎకనామిక్ కారిడార్‌లో భాగమైన రోడ్డు ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. జాతీయ రహదారి 163జీలో వరంగల్ నుంచి ఖమ్మం వరకు 108 కిలోమీటర్లు, ఖమ్మం నుంచి విజయవాడ వరకు 90 కిలోమీటర్ల పొడవైన గ్రీన్‌ఫీల్డ్ హైవే ఈ ప్రాజెక్టులో ఉన్నాయి. కేంద్రప్రభుత్వం మొత్తం 6,400 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు ప్రాజెక్టులను అభివృద్ధి చేయనుంది. అదేవిధంగా హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, లెక్చర్ హాల్ కాంప్లెక్స్ -3, సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ భవనాలను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos